ఇంగ్లాండ్ నడ్డి విరిచిన టీం ఇండియా.. భారత్ ఘన విజయం..!

చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పొందిన ఇండియా రెండవ టెస్టులో మాత్రం బాగా పుంజుకుని ఘన విజయం సాధించింది.

ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా 317 పరుగుల ఆధిక్యం తో గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

దీంతో ఈ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఇండియా 1-1 విజయాలతో నిలుస్తున్నాయి.రెండవ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఇండియా కి బాగా ప్లస్ అయ్యిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

రోహిత్ శర్మ ఫస్ట్ రోజే చెలరేగి పోవడం కూడా ఇంగ్లాండ్ జట్టు ని ఓటమికి దగ్గరగా చేసిందని చెప్పుకోవచ్చు.టీమిండియా బౌలర్లు లో అక్షర్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు.

టీమ్ ఇండియా ఇంగ్లాండ్ కి 482 పరుగులను లక్ష్యంగా పెట్టింది.భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేయగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Advertisement

ఫలితంగా టీమిండియా కి తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగుల ఆధిక్యం లభించింది.ఇక రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ సెంచరీ బాదడంతో టీమ్ ఇండియా జట్టు 286 పరుగులు చేయగలిగింది.

దీంతో 482 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అడుగు పెట్టింది.కానీ 164 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆలవుట్ అయ్యింది.

దీనికి కారణం చెన్నై పిచ్ పై స్పిన్ బౌలింగ్ బాగా అనుకూలించడమే అని చెబుతున్నారు.రెండవ ఇన్నింగ్స్ లో 100 పరుగులకే ఇంగ్లాండ్ నాలుగు కీలక వికెట్లు కోల్పోవడం కూడా ఇంగ్లాండ్ జట్టు కి బాగా మైనస్ అయ్యింది.లారెన్స్ 26, బర్న్స్ 25 పరుగులకే పెవిలియన్ కి చేరుకున్నారు.

కెప్టెన్ జో రూట్ కూడా 33 పరుగులకే ఔటయ్యాడు.దీంతో ఇంగ్లాండ్ జట్టుకి ఇండియా చేతిలో పరాజయం తప్పలేదు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు