విశాఖలో భారత్ ఓపెనర్ల పరుగుల వరద... విండీస్ కి భారీ లక్ష్యం

భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మొదటి మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ లు రాణించిన, బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో విండీస్ బ్యాట్స్ మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించారు.

ఇక ఈ రోజు రెండో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతుంది.ఇక విశాఖ స్టేడియం అంటే భారత్ బ్యాట్స్ మెన్ లకి భాగా అచ్చోచ్చే మైదానం.

ఎక్కడ ఇండియా గెలుపుల శాతం ఎక్కువ.అలాగే వైజాగ్ అంటే భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సొంత మైదానం లాంటిది.

ఈ మైదానంలో రోహిత్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.దీంతో ఈ వన్డే లో భారత్ బ్యాట్స్ మెన్స్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.

Advertisement

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కు ఐదు వికెట్లను కోల్పోయి విండీస్‌కు 388 ప‌రుగులు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.రోహిత్ శ‌ర్మ 138 బంతుల్లో 159 ప‌రుగులు, కెఎల్ రాహుల్ 104 బంతుల్లో 102 ప‌రుగులతో సెంచరీలు నమోదు చేశారు.

అలాగే ఫస్ట్ వికెట్ భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.వీరి తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌట్ అయిన కూడా శ్రేయ‌స్ అయ్య‌ర్ 32 బంతుల్లో 53 ప‌రుగులు, రిష‌బ్ పంత్ 16 బంతుల్లో 39 ప‌రుగులతో బ్యాట్ ఝుళిపించారు.

దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు