ఏడ్చి మరీ గెలిచిన బాబు ! సానుభూతి మామూలుగా లేదు ?

ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్ళ వ్యవవహరం ఏపీ రాజకీయాల్లో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది.

ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది అనే విషయంపై ఇంకా విమర్శలు , ప్రతి విమర్శలు టీడీపీ , వైసీపీ నాయకులు చేసుకుంటూనే ఉన్నారు.

తన భార్య భువనేశ్వరి ని ఉద్దేశించి వైసీపీ నాయకులు అవమానపరిచే విధంగా మాట్లాడారని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం తో పాటు , వైసీపీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ముఖ్యంగా ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీ, ఏపీ మంత్రి కొడాలి నాని వంటి వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి .మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయాలు జనాలు నుంచి ప్రారంభమయ్యాయి.ఈ వ్యవహారం జరిగి నెల రోజులు అవుతుంది.

ఇంకా దీనికి సంబంధించిన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.  టీడీపీ ఆధ్వర్యంలో నిరసన సభలు నిర్వహిస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలో.ప్రతి గ్రామంలో ఈ సభలను టీడీపీ నిర్వహిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది.

Advertisement

ఈ వ్యవహారం అధికార పార్టీ వైసీపీ కి ఇబ్బందికరంగా మారింది .దీంతో జగన్ ఆదేశాలతోనో , కమ్మ సామాజిక వర్గం ఒత్తిడితోనో కానీ ఈ వ్యవహారంలో ప్రధాన కారకుడైన వల్లభనేని వంశీ తప్పు  ఒప్పుకున్నారు.భువనేశ్వరి కి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు.

దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసి పోయిందనుకున్నా,  ఏపీ మంత్రి కొడాలి నాని మాత్రం అసలు తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పాలంటూ ఈ వివాదాన్ని మరింత రాజేస్తున్నారు.వైసీపీలోనే ఇప్పుడు చంద్రబాబు,  ఆయన సతీమణి వ్యవహారంలో సానుభూతి వ్యక్తమవుతోంది.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.చంద్రబాబు భార్య భువనేశ్వరి పై తమ పార్టీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని, తమ కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడిగి క్షమాపణ చెబుతాము అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో వైసీపీ నాయకులు అసెంబ్లీలోనూ,  బయట చేసిన వ్యాఖ్యలు నిజమేనని , చంద్రబాబు ఏడుపుకు ఒక కారణం ఉందని జనాల్లోకి అభిప్రాయం వెళ్లిపోయింది.

ఇదే వ్యవహారంపై నారా భువనేశ్వరి మొదట్లోనే స్పందించి బహిరంగ లేఖను విడుదల చేశారు.  ఆ తర్వాత మరింతగా ఈ వ్యవహారంపై సానుభూతి పెరిగింది.ఇది వైసీపీకి మరింత డ్యామేజ్ చేస్తుందని,  మహిళల విషయంలో మంత్రులు,  ఎమ్మెల్యేలు చులకన భావంతో వ్యవహరిస్తున్నా.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

 జగన్ కట్టడి చేయలేకపోతున్నారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోవడంతో జగన్ అప్రమత్తమై నష్టనివారణ చర్యలకు దిగారని,  దీనిలో భాగంగానే వంశీ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి వారి స్పందన  ఈ విధం గా ఉండడానికి కారణం అనే విషయం అర్థమవుతోంది.ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు కన్నీళ్లు వైసీపీ కి బాగా డ్యామేజ్ తీసుకువచ్చాయి.

Advertisement

తాజా వార్తలు