టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ మహిళా నేతపై !

టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ బీజేపీ మహిళా నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరిగిన రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని మండిపడిన ఆమె టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో టీటీడీ విభాగం అధికారులు ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదైంది.ఈ నెల 5వ తేదీన అయోజ్యలో జరిగిన రామాలయ భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని, దీంతో ఆమె టీటీడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

ఫిర్యాదు మేరకు యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.కేసుకు సంబంధించిన వివరాల కోసం మహిళా నేత యామిని తమ వివరణ ఇవ్వాలని తెలిపారు.

Advertisement

కాగా, సాధినేని యామిని గతంలో టీడీపీలో పని చేశారు.టీడీపీ నుంచి బీజేపీలోకి 2019లో చేరారు.

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు