యాదాద్రి జిల్లాలో కల్తీ పాల గుట్టు రట్టు

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా వెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల, గౌస్ కొండ గ్రామాల్లో కల్తీ పాల గుట్టు రట్టైంది.

పక్కా సమాచారంతో కల్తీ పాల కేంద్రాలపై యాదాద్రి భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.కనుముకల గ్రామంలో పాండు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద 150 లీటర్ల కల్తీపాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే గౌస్ కొండ గ్రామంలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని 200 లీటర్ల కల్తీ పాలను సీజ్ చేశారు.గ్రామాల్లో సైతం కల్తీ పాల దందా వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

Latest Rajanna Sircilla News