నరసాపురం బరిలో టిడిపి రెబల్ ? జనసేనకు ఇబ్బందేగా 

పొత్తులో భాగంగా జనసేన , బీజేపీలకు( Janasena , BJP ) సీట్లు కేటాయించడంపై టిడిపిలో ఇంకా అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూనే ఉన్నాయి.

పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు తమ నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే,  వారు గెలిచాక అక్కడే పాతుకుపోతారని , తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో చాలాచోట్ల టిడిపి టికెట్ ఆశించి భంగపడిన నేతలు రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే అనేక చోట్ల ఈ విధమైన పరిస్థితి నెలకొనగా,  తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోనూ( Narasapuram Constituency ) ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది.  ఇక్కడ టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా జనసేనకు ఇక్కడ సీటును కేటాయించారు.

  తమ పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ ను జనసేన ప్రకటించింది.అయితే ఇక్కడ టిడిపి నేతలు నాయకర్ కు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.

దీనికి కారణం అక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు( MLA Bandaru Madhava Naidu ) టికెట్ ఆశించి భంగపడడమే కారణం.ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్మిడి నాయకర్కు తాను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాధవ నాయుడు బహిరంగంగా చెబుతున్నారు.అవసరమైతే రెబల్ గా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు.

Advertisement

నరసాపురంలో ఇటీవల నిర్వహించిన ప్రజాగణంలో మాధవ నాయుడు పేరు ఎత్తకుండా చంద్రబాబు అక్కడ పర్యటించడం పై మాధవ నాయుడు, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాధవ నాయుడు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.2014 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందిన బండారు మాధవ నాయుడు, 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు ( Mudunuri Prasada Raju )చేతిలో ఓటమి చెందారు.అప్పటి నుంచి టిడిపి తరపున నియోజకవర్గం అతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసిపి  ప్రభుత్వం పైన , స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాల పైన పోరాటాలు చేస్తూనే వస్తున్నారు.

2024 ఎన్నికల్లోను పోటీ చేసి గెలవాలని పట్టుదలతో మాధవ నాయుడు ఉండగా,  ఇక్కడ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో మాధవ నాయుడు అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంటున్నారు.ఇప్పుడు ఆయన రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో, టిడిపి జనసేన లు కాస్త కంగారు పడుతున్నాయి.ఈ విషయంలో మాధవ నాయుడును బుజ్జగించేందుకు టిడిపి కొంతమంది కీలక నాయకులను రంగంలోకి దించనుందట.

Advertisement

తాజా వార్తలు