తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం 9 మంది మృతి..!!

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు మానవ లోకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఒకపక్క ఆఫ్గానిస్థాన్ ( Afghanistan )లో భూకంపం మరోపక్క ఇజ్రాయెల్ దేశంపై( Israel ) హమాస్ మిలిటెంట్ లు చేస్తున్న దాడులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆడవాళ్లను మరియు పిల్లలను కిడ్నాప్ చేసి మరి దారుణంగా చంపుతున్నారు.హమాస్ మిలిటెంట్ లు.ఇజ్రాయెల్ సైనికులు పట్టుపడితే వారిని బందీలుగా తీసుకెళ్లి అత్యంత క్రూరంగా చంపుతున్నారు.ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉండగా.

In A Godown Where Fireworks Are Stored Nine Members Died In Tamil Nadu , Fire Ac

తమిళనాడు రాష్ట్రంలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.విషయంలోకి వెళ్తే తమిళనాడులోని అరియలుర్ జిల్లాలో( Ariyalur , Tamil Nadu ) బాణాసంచ నిల్వ ఉంచిన గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ అగ్ని ప్రమాదం ఘటన పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

అంతేకాకుండా మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు సహాయాన్ని ప్రకటించారు.మరోపక్క మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.

అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు.ప్రమాదంలో గాయపడ్డ వారిని తంజావూరు మెడికల్ కాలేజీలో చేర్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?
Advertisement

తాజా వార్తలు