1936లో రూ.2,700కే షెవర్లే కారు.. అప్పటి ధరలు వింటే దిమ్మతిరిగిపోతుంది..!

ఓల్డ్ ఇజ్‌ గోల్డ్ అనే మాట చాలా మంది నోట వినిపిస్తుంది.ప్రజలకు భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసుకోవాలనే కాదు భూతకాలంలో ఏం జరిగిందో తెలుసుకోవడమూ ఇష్టమే.

నేటి తరం వారికి కూడా ఓల్డ్ వస్తువులు, పత్రాల మీద ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.అందుకే ఓల్డ్ ఐటమ్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది.50-60 ఏళ్లనాటి పెళ్లి పత్రికలు, కార్ల పాత బిల్లులు, రేషన్ సరుకుల రసీదులు చాలామందిని ఆకర్షిస్తున్నాయి.పెద్దవాళ్లకి ఇవి మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి, కుర్రాళ్లకి చరిత్రను తెలుసుకునే అవకాశం ఇస్తాయి.

ప్రస్తుతం ఒక ఓల్డ్ కార్ల ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ముఖ్యంగా యువతలో ఈ యాడ్ యమ క్రేజ్ సంపాదిస్తోంది.

ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఒక షెవర్లే ( Chevrolet ) మోటారు కారు కేవలం రూ.2,700కే లభిస్తుందని రాసి ఉంది.అంతేకాదు, అది "చీప్ అండ్ బెస్ట్" అని, కఠినమైన రోడ్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.అదే కంపెనీకి చెందిన మరో మోడల్, 5 సీట్ల కారు ధర జస్ట్ రూ.3,675 అని రాసి ఉంది.ఈ కార్లు లక్నోలో దొరుకుతాయని, కోలకతా, ఢిల్లీ, దిబ్రూగర్ ( Kolkata, Delhi, Dibrugarh )లాంటి నగరాలకు కూడా డెలివరీ చేస్తామని ప్రకటనలో తెలిపారు.

Advertisement

కారు మోడళ్లు, ధరలను చూస్తే, ఆ ప్రకటన 1936 నాటిదని స్పష్టంగా తెలుస్తోంది.అప్పట్లో రూ.2,700, రూ.3,675 అంటే చాలా పెద్ద మొత్తాలు.ఎందుకంటే అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు.నెటిజన్ల ప్రకారం, అప్పట్లో రూ.2,700 అంటే నేటి లెక్కల్లో రూ.2.7 కోట్లు! అంటే అప్పట్లో కారు కొనడం కూడా పేదవాడికే కలే.కార్‌బ్లాగ్ ఇండియా అనే ఇన్‌స్టా అకౌంట్ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.దీనికి నెటిజన్లు చాలా ఆసక్తికరంగా స్పందించారు.

ఒక యూజర్ "నేను ధనవంతుడినే, కానీ తప్పు శతాబ్దంలో పుట్టాను" అని కామెంట్ చేశాడు.దాదాపు ఒక శతాబ్దంలో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో, ముఖ్యంగా కార్ల ధరలు ఎంతలా పెరిగిపోయాయో తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పోస్ట్ రేకెత్తించింది.

Advertisement

తాజా వార్తలు