పాపం.. ఆ స్టార్ హీరో కూతురు డిప్రెషన్ కి గురైందట!

ఈ మధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు.

కొంతమంది సరైన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించి ఈ సమస్యల నుంచి బయటపడినా చాలామందికి ఈ సమస్యలకు చికిత్స గురించి సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూతురు డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు వెల్లడించింది. బాలీవుడ్ సూపర్​స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఐరా ఖాన్ తన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాలోవర్లతో మాట్లాడుతూ తన మానసిక ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.గత నాలుగు సంవత్సరాల నుంచి తాను డిప్రెషన్ తో బాధ పడుతున్నానని "వరల్డ్ మెంటల్ హెల్త్ డే" సందర్భంగా తన ఫాలోవర్లకు వెల్లడించింది.

అమీర్ ఖాన్ గారాలపట్టి ఐరా ఈ విషయం వెల్లడించగానే ఆమె ఫాలోవర్లు అవాక్కయ్యారు.అయితే ఫాలోవర్లు ఆరోగ్యం గురించి కంగారు పడవద్దని ఆమె చెప్పారు.

Advertisement

గతంతో పోలిస్తే సమస్య తగ్గుముఖం పట్టిందని.వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ డిప్రెషన్ నుంచి కోలుకున్నానని ఐరా వెల్లడించింది.

మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒకటి చేయాలని తనకు అనిపిస్తోందని ఐరా పేర్కొంది.అయితే ఏం చేస్తే మానసిక ప్రశాంతతను పొందగలుగుతానో తనకు అర్థం కావడం లేదని ఐరా తెలిపింది.

ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో విషయాలు చోటు చేసుకుంటున్నాయని తమ మనస్సులోని మాటలను వ్యక్తపరచాలని ఎంతోమంది అనుకుంటున్నారని ఐరా అన్నారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఐరా ఖాన్ ఫాలోవర్లను పెంచుకుంటూ ఫాలోవర్లకు తన లైఫ్ కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

లాక్ డౌన్ సమయంలో అల్లరి పనులు చేసి ఐరా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.టాటూలు వేసి ఆ టాటూలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఐరా డిప్రెషన్ తో బాధ పడుతుందని తెలిసి అమీర్ ఖాన్ అభిమానులు ఆమె త్వరగా సమస్య నుంచి పూర్తిగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు