ఇలియానాకు అవి నచ్చలేదట

తెలుగు సినిమాలు పక్కనపెట్టి ఎప్పుడైతే బాలివుడ్ బాట పట్టిందో, అప్పటినుంచి ఇలియానా కెరీర్ లో ఊపు తగ్గిపోయింది.

వెళ్లి వెళ్ళగానే రెండు మూడు మంచి ఆఫర్లు వచ్చినా, సక్సెస్ రేటు కూడా బాగానే ఉన్నా, ఇలియానాని పెద్దగా పట్టించుకోలేదు బాలివుడ్ జనం.

అందుకే రెండేళ్ళు ఖాలిగా కూర్చుంది.ఇప్పుడు లేకలేక అవకాశామైతే వచ్చింది అక్షయ్ కుమార్ పక్కన.

ఆగస్టులో విడుదల కాబోతోంది ఈ రుస్తుం చిత్రం.లేక్కలేసుకుంటే, దాదాపు రెండు సంవత్సారాల తరువాత ఇలియానా సినిమా ఒకటి విడుదల అవుతోంది.

ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే కథలు నచ్చలేదు అంటోంది ఇల్లి బేబి." ఈ రెండేళ్ళు గ్యాప్ ఇవ్వడం అనేది కావాలని చేయలేదు.

Advertisement

కాని ఈ విరామంలో నా దగ్గరకి వచ్చిన ప్రాజెక్ట్స్ నచ్చలేదు.ఇన్ని సినిమాలు చేసాక, నాకు నచ్చిన సినిమాలే చేయాలి అనిపిస్తూ ఉంటుంది.

అలాగని కమర్షియల్ సినిమాలకి వ్యతిరేకం కాదు.కాని నా పాత్రకు పెద్దగా విలువ లేని కథలు నేను చేయలేను.

ఈ రెండేళ్ళ కాలంలో మనసుకి నచ్చే కథలు దొరకలేదు, అందుకే చేయలేదు " అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.నిజంగానే ప్రాజెక్ట్స్ నచ్చలేదో లేక అసలు ప్రాజెక్ట్స్ ఇలియానా దాకా రాలేదో.

ఏది ఏమైనా, చేతిలో ఉన్న రుస్తుం అయినా ఇలియానాకు అవకాశాలు తెప్పిస్తే సంతోషం.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు