ఇండియాకి, అమెరికాకి మధ్య 10 తేడాలు చెప్పిన ఐఐటీ కపుల్.. ఏంటంటే?

చాలామంది అమెరికాకి( America ) వెళ్లి అక్కడ సెటిల్ కావాలని కలలు అంటారు.యూఎస్‌కి వెళ్లే ముందు అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తుంటారు.

అలాగే అమెరికాకి వెళ్లినవారు ఇండియాకి( India ) తిరిగి రావాలా వద్దా అనే సందేహాలతో కూడా ఉంటారు.ఇలాంటి వారి సందేహాలను తీర్చుతూ ఒక అవగాహన కల్పించడానికి అమెరికా వెళ్ళిన భారతీయులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేసిన ఇద్దరు ఐఐటీ (ఖరగ్‌పూర్) కపుల్స్ అమెరికాకి, ఇండియాకి మధ్య పది తేడాలు తాము గమనించినట్లు తెలిపారు.యూఎస్ నుంచి ఇండియాకి వచ్చాక తమ జీవితంలో 10 మార్పులు వచ్చాయని సోషల్ మీడియాలో ఒక లాంగ్ పోస్ట్ షేర్ చేశారు.

నయ్రిత్ భట్టాచార్య,( Nayrith Bhattacharya ) రిషితా దాస్( Rishita Das ) అనే ఈ జంట, అమెరికాలోని తమ కంపెనీ పనుల కోసం ఇంకా అక్కడికి ప్రయాణాలు చేస్తున్నారు.రిషితా దాస్ ఇప్పుడు బెంగళూరులోని IIScలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

Advertisement

"ఇండియాకు తిరిగి రావాలని ఆలోచిస్తున్న 20-40 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి భారతీయుడికి అలర్ట్.ఇండియాకు వచ్చాక మాకు ఎదురైన 10 పెద్ద మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఈ పోస్ట్ చదవండి" అని నయ్రిత్ తన ఎక్స్‌ పోస్ట్‌ని ప్రారంభించారు.

ఇండియాలో పని మనుషులకు తక్కువ శాలరీలు ఇస్తే సరిపోతుందని ఆ దంపతులు చెప్పారు.వీళ్ల వల్ల వారానికి 15 నుంచి 20 గంటల సమయం ఆదా అవుతుందని చెప్పారు.అమెరికాలో ఇలాంటి సౌకర్యం దొరకడం కష్టమని వాళ్లు అన్నారు.

అయితే, ఇండియాలో ట్రాఫిక్ ( Traffic ) చాలా బాధించే విషయమని కూడా వాళ్లు ఒప్పుకున్నారు."ఎందుకంటే, ఇక్కడ కార్లు ఎలా వెళ్తాయో ముందే చెప్పలేము, అన్ని రకాల వాహనాలు ఒకేసారి దూసుకొస్తాయి.

కానీ న్యూయార్క్ లేదా శాన్ ఫ్రాన్సిస్కో కంటే ఇండియాలో ట్రాఫిక్ అంత భయంకరంగా లేదు.మంచి విషయం ఏంటంటే, ఇండియాలో ఆన్‌లైన్‌లో కిరాణా సామాను, ఆహారం ఆర్డర్ చేస్తే అమెరికా కంటే చాలా త్వరగా ఇంటికి చేరుతుంది" అని పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 22, గురువారం 2024
యూఎస్ రెస్టారెంట్‌లో చేదు అనుభవం.. బలవంతంగా రూ.420 టిప్ కట్టించారు..?

"ఇండియాలో మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడం చాలా సులభం.కానీ అమెరికాలో రిలేషన్‌షిప్స్‌( Relationships ) స్ట్రాంగ్‌గా ఉండవు.అక్కడ ఎక్కువగా కాఫీ డేట్ లేదా పని గురించి మాట్లాడటం వరకే రిలేషన్‌షిప్ పరిమితం అవుతుంది.

Advertisement

డబ్బు చెల్లింపు విషయంలో కూడా తేడా ఉంటుంది.అమెరికాలో యాపిల్ పే యాప్‌తో, ఇండియాలో UPI అనే యాప్‌తో డబ్బు చెల్లించడం చాలా సులభం.

కానీ UPI ఫ్రీ.యాపిల్ పేను ఉపయోగిస్తే, చెల్లింపులో 2 నుంచి 7 శాతం డబ్బు ప్రైవేట్ కంపెనీలకు వెళ్తుంద"ని ఈ కపుల్ చెప్పారు.

"అమెరికాలో ప్రజలు చక్కగా లైన్‌లో నిలబడతారు. కానీ ఇండియాలో కౌంటర్ల వద్ద, కాఫీ షాపుల్లో, సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ల వద్ద అందరూ ఒకేసారి ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు.ఇది మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినప్పటికీ, కొంతకాలానికి అలవాటు అయిపోతుందని.

మాకు ఆహారం అంటే చాలా ఇష్టం.దోసె, బిర్యానీ లాంటి టేస్టీ ఫుడ్ ఇండియాలో దొరుకుతుంది.

కానీ అమెరికాలో అనేక రకాల చీజ్‌లు, బ్రెడ్‌లు, డెజర్ట్‌లు దొరుకుతాయి అవి కూడా బాగుంటాయి" అని వీళ్లు పేర్కొన్నారు.అలాగే ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు, ఇంకా వివిధ రకాల జెండర్స్ మధ్య సెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ను అమెరికా యాక్సెప్ట్ చేస్తుందని, ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి లేదని వీళ్లు తెలిపారు.

ఇండియాలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు హైపెయిన్ జాబ్ కనిపెట్టడం కొద్దిగా కష్టమే అని కూడా తెలిపారు.వీరి పోస్ట్ చాలా ఉపయోగపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పేరు పోస్ట్ కి 50 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

తాజా వార్తలు