రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే మైండ్ రీఫ్రెష్‌గా, యాక్టివ్‌గా మారుతుంది!

ఉదయం లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.అసలు టీ లేదా కాఫీ తాగకుంటే కొందరికి రోజు కూడా గడవదు.

అయితే టీ, కాఫీలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మాత్రం మీ మైండ్‌ను రిఫ్రెష్ గా మరియు యాక్టివ్ గా మారుస్తుంది.

అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను సైతం అందిస్తుంది. మరి ఇంతకీ ఆ మార్నింగ్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ప‌ది పుదీనా ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.

Advertisement

ఆపై కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుని అందులో దంచి పెట్టుకున్న పుదీనా ఆకులు, నానబెట్టుకున్న సబ్జా గింజలు, చిటికెడు నల్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల‌ నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, ఒక గ్లాస్ చల్లటి నీరు వేసుకుని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా షేక్ చేస్తే డ్రింక్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ డ్రింక్‌ను గ్లాస్‌లోకి స‌ర్వ్ చేసుకుని తాగడమే.ఈ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్‌ను మార్నింగ్ సమయంలో తీసుకుంటే మైండ్ రీ ఫ్రెష్ గా మరియు యాక్టివ్ గా మారుతుంది.త‌ల‌నొప్పి, చిరాకు, ఒత్తిడి వంటివి దూరం అవుతాయి.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలగిపోతాయి.జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.

మార్నింగ్ సిక్ నెస్ ప‌రార్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

మరియు హ్యాంగోవర్ తో ఇబ్బంది పడేవారికి కూడా ఈ డ్రింక్ ఒక న్యాచుర‌ల్‌ మెడిసిన్ లా పని చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు