Hair Fall Home Remedy : వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఒక్క వెంట్రుక కూడా రాల‌దు!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం, కాలుష్యం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల కొందరిలో హెయిర్ ఫాల్‌ అనేది చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఒత్తైన జుట్టు కొద్ది రోజుల్లోనే పల్చబడుతుంది.

అందుకే జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం నానా తిప్పలు పడుతుంటారు.కొందరైతే మందులు కూడా వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే ఒక్క వెంట్రుక కూడా రాల‌దు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందు రెండు అంగుళాల లేత అల్లం ను తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన అల్లం ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

మిక్సీ జార్లో ఈ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు చక్కగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ రెమెడీని పాటించడం వల్ల అల్లం, కొబ్బరి నూనె మరియు ఆముదంలో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు కుదుళ్ల‌ను బ‌లోపేతం చేస్తాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య ఏమైనా ఉంటే దూరం అవుతుంది.

తలలో ఇన్ఫెక్షన్, దురద వంటివి సైతం పరార్ అవుతాయి.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నవారు ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పిన రెమెడీని వారంలో ఒక్కసారైనా పాటించండి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి.

Advertisement

తాజా వార్తలు