వింటర్ లో రోజూ ఉదయం ఈ వాటర్ తాగితే వెయిట్ లాస్ తో సహా బోలెడు ఆరోగ్య లాభాలు?

ప్రస్తుత చలికాలంలో ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఏదో ఒక అనారోగ్య సమస్య నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది.

ముఖ్యంగా వింటర్ లో చాలా మంది వెయిట్ గెయిన్ అవుతుంటారు.

ఎందుకంటే చలి కారణంగా వ్యాయామం చేసేందుకు ఇష్టపడరు.శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

పెరిగిన బరువు కార‌ణంగా తీవ్ర ఒత్తిడికి లోన‌వుతుంటారు.కానీ వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను వింటర్ లో రోజూ ఉదయం తాగితే వెయిట్ లాస్ తో సహా బోలెడు ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఆ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్‌ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వాము( Ajwain ), వన్ టేబుల్ స్పూన్ సోంపు, ఒక బిర్యానీ ఆకు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.దాంతో వాటర్ ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

రోజు ఉదయం ఈ వాటర్ ను తీసుకుంటే ఆరోగ్యపరంగా బోలెడు లాభాలు చేకూరుతాయి.ముఖ్యంగా శరీరంలో అధిక క్యాలరీలు కరుగుతాయి.వెయిట్ లాస్ అవుతారు.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ వాటర్ చాలా ఉత్తమంగా సహాయపడతాయి.అలాగే చలికాలంలో జీర్ణక్రియ అనేది నెమ్మదిస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

దీంతో గ్యాస్, మలబద్ధకం( Constipation ), అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.అయితే ఇప్పుడు చెప్పుకున్న వాటర్ ను రోజు తీసుకుంటే ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Advertisement

వాము మరియు సోంపు రెండు వేడి లక్షణాలను కలిగి ఉంటాయి.అందువల్ల ఈ రెండిటిని వేసి మరిగించిన వాటర్ ను తీసుకోవడం వల్ల చలి వాతావరణాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు.

అలాగే ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌ గా ఉంటాయి.అందువల్ల రోజు ఈ వాటర్ ను తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఫలితంగా సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు.

తాజా వార్తలు