కొబ్బరి పాలను ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా ఎన్నో సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!

కొబ్బరి పాలు.( Coconut Milk ) చక్కటి రుచితో పాటు బోలెడన్ని విలువైన పోషకాలు కలిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్యపరంగా కొబ్బరి పాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అందులోనూ కొబ్బరి పాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో( Weight Loss ) సహా ఎన్నో సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి పాలను ఎలా తీసుకుంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అంగుళం దాల్చిన చెక్క వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసి విస్కర్ తో బాగా తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు హీట్ చేయాలి.

Advertisement

ఆపై స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకుని.వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి సేవించాలి.ఈ డ్రింక్ ను టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

ఈ విధంగా కొబ్బరి పాలను ప్రతి రోజు కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.వేగంగా బరువు తగ్గుతారు.

అదే సమయంలో కొబ్బరి పాలను ఇలా తీసుకోవడం వల్ల నిద్రలేమి దూరమవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.

మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.గ్యాస్‌, ఎసిడిటీ ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.

Advertisement

గుండె ఆరోగ్యంగా మారుతుంది.శరీరంలో పెరిగిపోయిన మలినాలు తొలిగిపోతాయి.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

చర్మం యవ్వనంగా, గ్లోయింగ్ గా సైతం మెరుస్తోంది.

తాజా వార్తలు