Subrahmanyaswamy Temple : లేఖ రాసి హుండీలో వేసిన భక్తుడు… అందులో ఏం రాశాడో తెలిస్తే..!

తమిళనాడులో( Tamil Nadu ) జరిగిన ఒక వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఒక భక్తుడు తన అప్పు తీర్చాలంటూ దేవుడికి లేఖ రాసాడు.

ఆ లేఖను గుడిలో ఉన్న హుండీలో వేసాడు.ఈ సంఘటన తమిళనాడు లోని ధర్మపుడి కుమారస్వామి పేటలోని( Dharmapudi Kumaraswamy Peta ) సుబ్రహ్మణ్యస్వామి గుడిలో జరిగింది.

ఆ చూసిన ఆలయ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.

విషయంలోకి వెళ్తే, తమిళనాడులోని కుమారస్వామి పేటలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో( Subrahmanyaswamy Temple ) ఒక భక్తుడు తన అప్పు తీర్చమంటూ దేవుని వేడుకుంటూ ఒక లేఖ రాసి హుండీలో వేసాడు.ఆలయ సిబ్బంది హుండీ లోని కానుకలను లెక్కించడం కోసం హుండీని తెరవగా వారికీ ఆ లేఖ కనపడింది.వెంటనే దానిని తీసుకొని చూడగా దాంట్లో ఒక భక్తుడు తనకున్న అప్పుల వివరాలను ఆ లేఖలో రాసి వాటిని తీర్చాలని కింద శ్లోకాలతో రాసాడు.

Advertisement

ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆ భక్తుడు తనకు కోటి రూపాయల అప్పు ఉంది అని ఆ అప్పులన్నీటిని దేవుడే తీర్చాలని స్వామివారిని కోరుకున్నాడు.అంతేకాకుండా ఆ లేఖలో ఎవరెవరికి ఎంతేంత ఇవ్వాలో, గోల్డ్ లోన్, యూనియన్ లోన్, హౌస్ లోన్ ఎలా అన్ని అప్పులను విడివిడిగా లెక్కలు కూడా ఆ లేఖ లో రాసుకొచ్చాడు.మొత్తం కలిపి కోటి రూపాయల అప్పుల సమస్యలు ఉన్నాయని, దానిని దేవుడే పరిష్కరించాలని వేడుకున్నాడు.

అయితే ఆ లేఖ ఎవరు రాసారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.ఈ లేఖ చదివిన ఆలయ సిబ్బందే కాకుండా సోషల్ మీడియా లో చూసిన నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.

దేవునికి చెప్పే ఈ అప్పులు చేశావా ఆయనెందుకు ఇందులో నీకు సహాయం చేస్తాడు అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.ఏది ఏమైనా ఇతని లాగా ఆలోచిస్తే భవిష్యత్తులో హుండీలో కానుకలకు బదులు అన్నీ ఇలాంటి లెటర్సే వస్తాయి.

కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)
Advertisement

తాజా వార్తలు