సిద్దు స్టార్ హీరో అవ్వాలంటే ఇదొక్కటి చేస్తే చాలు...

ప్రస్తుతం ఇండస్ట్రీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అందులో కొన్ని సక్సెస్ అయితే చాలా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

ఇక సిద్దు జొన్నలగడ్డ( Siddu jonnalagadda ) హీరో గా ఇంతకు ముందు సూపర్ సక్సెస్ అయిన డీజే టిల్లు సినిమా( DJ Tillu ) మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా కి సీక్వెల్ గా వస్తున్న డీజే టిల్లు 2 సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా మంచి హిట్ అయితే సిద్దు ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా మారిపోతాడు ఇప్పటికే ఆయన కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అయినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ అయితే అది ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంది.

అయితే సిద్దు స్టార్ హీరో అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఆయన చేసే సినిమాల సెలక్షన్ అంత బాగుండటం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు డీజే టిల్లు ని మినహా ఇస్తే ఆయన తన సినీ కెరీయర్ లో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి అందుకే ఇక ఆయన ఇప్పుడు సినిమాలు చేసే విషయం లో కొంచం జాగ్రత్తగా ఉంటే బెటర్.ఇక ఇప్పటికే ఆయన స్లాంగ్ జనాలకి బాగా నచ్చింది కాబట్టి ఆయన చేసే సినిమాలు కొంచం బాగుంటే ఆయన ఇక స్టార్ హీరో అవ్వచ్చు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలకి తనే రైటర్ గా కూడా చేశాడు.

ఇక చిరంజీవి ( Chiranjeevi )తో ఒక మల్టీ స్టారర్ సినిమాలో కూడా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇది కనక నిజమే అయితే సిద్దు ఇక కెరియర్ పరంగా సూపర్ సక్సెస్ అవుతాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

అయితే సిద్దు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.అందుకే ఆయనకి ఇండస్ట్రీ లో ఒక సెపరేట్ ప్లాట్ ఫామ్ దొరికిందనే చెప్పాలి.చూడాలి మరి సిద్దు తన కెరియర్ లో ఎంత పెద్ద స్టార్ హీరో అవుతాడో.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు