మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా..? నివారణకు ఈ ఆలయంలో..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయినా కాలసర్ప దోషం( Kaala Sarpa Dosham ) ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అంతేకాకుండా ఎంత ప్రయత్నాలు చేసిన కూడా ధన, సంపద విషయంలో అడుగు ముందుకు పడదు.

దీంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాలసర్ప దోషం వలన మనిషి జీవితంలో చాలా రకాల సమస్యలు కలుగుతాయి.

అయితే చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది.జాతకంలో ఉన్న ఈ కాలసర్ప దోషాన్ని తొలగించే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం.

అయితే ఆ దేవాలయంలో నియమ, నిబంధల ప్రకారం పూజలు చేయడం వలన కాల సర్ప దోషం తొలగి సుఖసంతోషాలు నెలకొంటాయి.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం( Trimbakeshwar Temple ) కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది.

If Kaala Sarpa Dosh In The Horoscope Then Once Visit Trimbakeshwar Temple Detail
Advertisement
If Kaala Sarpa Dosh In The Horoscope Then Once Visit Trimbakeshwar Temple Detail

హిందూ విశ్వాసాల ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చాలా ముఖ్యమైనది.ఎందుకంటే అక్కడ నాగ పంచమి లేదా ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాలసర్ప దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందినది.

అయితే కాలసర్ప దోషం నుండి బయటపడడానికి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.ఈ పవిత్ర జ్యోతిర్లింగం దర్శనం వలన సర్పదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం.

కాబట్టి కాలసర్ప దోషం నుండి విముక్తి పొందేందుకు దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు శివుని పవిత్ర క్షేత్రానికి వస్తారు.

If Kaala Sarpa Dosh In The Horoscope Then Once Visit Trimbakeshwar Temple Detail

అయితే ఈ ఆలయంలో కాల సర్ప దోష నివారణకు కనీసం మూడు గంటల పూజ నిర్వహిస్తారు.ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్టించబడ్డాడు.కాల సర్ప దోషం నివారించడానికి రోజు భైరవ కృష్ణ పూజ చేయడం వలన కాలసర్ప దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!

అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ ఉండాలి.అలాగే బుధవారం నాడు చిటికెన వేలికి పవిత్రమైన ఉంగరాన్ని ధరించాలి.ఇక ప్రతి బుధవారం రాహు మంత్రాన్ని జపించి పెసరపప్పుని ఒక నల్ల బట్టలో చుట్టి అవసరమైన వ్యక్తికి దానం చేయాలి.

Advertisement

ఇలా చేయడం వలన కాలసర్పదోషం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

తాజా వార్తలు