ఆయన ఉంటే ఒకవిధంగా లేకపోతే మరోవిధంగా...!

తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimhaswamy) వారి దేవస్థానంలో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు నిత్యం వినిపిస్తూ ఉన్నాయి.

ఆలయ ఈవో భాస్కరరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంత మేరకు పాలన గాడిలో పడ్డట్లు కనిపించింది.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా దేవస్థాన ఈవో (EO) అన్నిరకాల సౌకర్యాలు మెరుగుపరుస్తున్న తరుణంలో కొండపైన వర్తక సంఘం కొబ్బరికాయల దుకాణాల వద్ద మరియు దీపారాధన వద్ద ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేసి భక్తులపై ఎలాంటి భారం పడకుండా చర్యలు తీసుకున్నారు.కానీ,దేవస్థాన ఈవో చర్యల పట్ల భక్తులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని చెప్పవచ్చు.

If He Is One, If Not, Another, Yadagirigutta , Sri Lakshmi Narasimhaswamy ,DEO ,

ధరల బోర్డులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయని అంటున్నారు.దేవస్థానంలో ఈవో భాస్కరరావు పర్యవేక్షణ సమయంలో మాత్రం ధరల పట్టికను అనుసరించి భక్తులకు విక్రయాలు చేస్తున్నారని,ఈవో భాస్కరరావు లేని సమయంలో పాత ధరలనే కొనసాగిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కొబ్బరికాయ,దీపారాధన వర్తకసంఘం వ్యాపారులు, టెండర్ దారులు ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులూ లేనప్పటికీ వర్తక సంఘం వ్యాపారులతో, దీపారాధన టెండర్(Deeparadhana tender) దారునితో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని,కొండపై దుకాణాల సముదాయలలో కొబ్బరికాయ,దీపారాధన, హోటల్లలో ఖచ్చితమైన ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేసి వాటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.వ్యాపారులకు లాభాలు వచ్చే వాటర్ బాటిల్,వస్తువులను విక్రయించడం పట్ల భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

యాదగిరిగుట్ట కొండపై దేవస్థానం తరపున వేసిన టెండర్లలో భాగంగా వర్తక సంఘం వ్యాపారులకు మరియు టెండర్ దారులకు ఒక నిర్దిష్టమైన ధరను నిర్ణయించి ధరల పట్టిక బోర్డులను ఈవో భాస్కరరావు ఎర్పాటు చేసిన ఫలితం లేకపోయిందని భక్తులు వాపోతున్నారు.ఈవో లేని సందర్భాల్లో ధరల పట్టిక బోర్డులపై తెరపత్రం వేసి, మరియు అడ్డుగా నిలబడి ఎక్కువ ధరలకు అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు.

దేవస్థానంలో ఈవో భాస్కరరావుకు ఉన్న శ్రద్ధ మిగిలిన అధికారులు డిఈవో,ఏఈవోలకు (DEO , AEO )లేదనే విషయం స్పష్టమవుతోంది.దేవస్థాన అధికారులు వర్తకసంఘం వ్యాపారులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఒక విధంగా చూస్తే దేవస్థాన అభివృద్ధికి గండి కొట్టే విధంగా అధికారుల ప్రవర్తన ఉందని,భక్తులను అయోమయ స్థితిలోకి లాగుతుందని వాపోతున్నారు.దేవస్థానంలో ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకపోతే గుడితో పాటు గుళ్లో లింగాన్ని కూడా మింగేలా ఉన్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇకనైనా ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానంపై దృష్టి సారించి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను అరికట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News