ఆ డివైస్ తో క్షణాలలో కరోనా వైరస్ లక్షణాలు గుర్తింపు...!

కొవిడ్-19 అనుమానితులు ఇకపై ఆసుపత్రులకు వెళ్లి తమ అనారోగ్యానికి సంబంధించిన టెస్టులు చేయించుకొనక్కర్లేదు.

ఎందుకంటే యాపిల్ వాచ్ ద్వారా కరోనా వైరస్ లక్షణాలు కనుగొనవచ్చని మౌంట్ సినాయ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఒక స్టడీ లో కనుగొన్నారు.

ఐతే మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ జర్నల్ లో వారియర్ వాచ్ స్టడీ పేరిట తమ పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.ఈ అధ్యయనంలో వందల మంది మౌంట్ సినాయ్ హెల్త్ కేర్ వర్కర్లు శాస్త్రవేత్తలు అందించిన యాపిల్ ఫోన్ లను వినియోగించడం తో పాటు యాపిల్ వాచ్ లను ధరించి తమ హెల్త్ ని పర్యవేక్షించారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు ప్రతిరోజు పార్టిస్పెంట్స్ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను సర్వేల ద్వారా శాస్త్రవేత్తలు సేకరించారు.ఇందుకోసం ఒక అప్లికేషన్ ని వాడారు.

అలాగే పార్టిస్పెంట్స్ ధరించిన యాపిల్ వాచ్ ద్వారా హృదయ స్పందనలలో మార్పుని గమనించారు.

Advertisement

అయితే కొందరి పార్టిస్పెంట్స్ కి దగ్గు, జలుబు లక్షణాలతో పాటు హృదయ స్పందనలలో వ్యత్యాసం గుర్తించబడింది.దీనితో వారికి కొవిడ్-19 లక్షణాలు ఉన్నాయని కేవలం వాచ్ ద్వారానే శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు.అయితే వారం లేదా రెండు వారాల తర్వాత అనగా covid-19 నిర్ధారణ అయిన తర్వాత కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తుల హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి వస్తున్నట్లు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

అయితే సంప్రదాయ పద్ధతిలో కంటే స్మార్ట్ వాచ్ ను ఉపయోగించి ముందుగానే రోగాన్ని గుర్తించవచ్చని ఈ పరిశోధనలో తేలింది.మున్ముందు రోజుల్లో డిజిటల్ పరికరాల సహాయంతో చాలా వేగంగా జబ్బులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం కరోనా హెల్త్ కేర్ వర్కర్స్ మానసికంగా ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో స్మార్ట్ వాచ్ ల ద్వారా కనుగొనేందుకు శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.ఇకపోతే యాపిల్ వాచ్ లు గతంలో కూడా తమ వినియోగదారుల అనారోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు ముందుగానే కనిపెట్టి చాలా మంది ప్రాణాలను కాపాడాయి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు