ఛాంపియన్స్ ట్రోఫీకి( Champions Trophy ) ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఆసక్తికరంగా మారింది.న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్ చేరుకుంది.
మరో ఫైనల్ స్థానం కోసం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య పోరు సాగుతోంది.ఈ కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
కెప్టెన్ టెంబా బావుమా, మాథ్యూ బ్రిట్జ్కే రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బౌలింగ్‌ను షాహీన్ అఫ్రిదికి అప్పగించాడు.
ఈ ఓవర్ ఐదవ బంతికి బ్రిట్జ్కే మిడ్-ఆన్ వైపు షాట్ ఆడాడు.ఆ తర్వాత అఫ్రిదితో అతను ఏదో మాట్లాడగా, ఆగ్రహంతో అఫ్రిదీ బ్రిట్జ్కే వైపు చిరాకుగా చూసాడు.
ఈ ఘటనతో ఆన్-ఫీల్డ్ అంపైర్స్, కెప్టెన్లు రిజ్వాన్, టెంబా బావుమా జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు.అయితే ఈ గొడవ ముగిసిందనుకున్న సమయంలో మరో ఘర్షణ చోటు చేసుకుంది.
28వ ఓవర్లో ఆ తర్వాత బంతికె బ్రిట్జ్కే డీప్ స్క్వేర్ లెగ్ ( Britzke to deep square leg )వైపు షాట్ కొట్టి పరుగు కోసం పరిగెత్తాడు.అలా పరుగు తీస్తుండగా అతను షాహీన్ అఫ్రిదీకి ఢీ కొట్టాడు.దీంతో అఫ్రిదీ మరోసారి కోపంతో అతనిపై గొడవకు దిగాడు.బ్రిట్జ్కే కూడా తిరిగి అఫ్రిదీ వైపు కోపంగా స్పందించాడు.ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఇక ఆ తర్వాత 29వ ఓవర్లో బ్రిట్జ్కే రనౌట్ అయ్యాడు.
దానితో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది.బ్రిట్జ్కే 84 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు చేశాడు.
అతనితో పాటు కెప్టెన్ టెంబా బావుమా (82), క్లాసెన్ (87)లు రాణించడంతో దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ముందు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసినప్పటికీ, పాకిస్తాన్ జట్టులో ఉన్న బలమైన బ్యాటింగ్ లైనప్ మ్యాచ్‌ను గట్టెకించింది.పక్షితం ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలతో రెచ్చిపోవడంతో భారీ స్కోరును ఛేదించి చివరకు విజయం సాధించి.దీనితో ముక్కోణపు టోర్నీలో ఫైనల్ కు చేరుకుంది.
బ్రిట్జ్కే-అఫ్రిదీ మధ్య జరిగిన ఘర్షణ సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.