ప్రేమికుల దినోత్సవం ( Valentine’s Day ) అంటే ప్రేమను వ్యక్తం చేసే ప్రత్యేకమైన రోజు.అయితే ఈ పర్వదినాన్ని సరదాగా జరుపుకోవడం బదులుగా, కొందరు యువతి యువకులు రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టి చేసే సాహసాలు ( Stunts ) ఇతరుల ప్రాణాలకు ప్రమాదాన్ని తెస్తున్నాయి.
ఈ స్టంట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫేమస్ అవ్వాలని కలలు కంటున్నారు.కానీ, ఈ సాహసాలు కేవలం ఒకవేళ తప్పు జరిగినా మీ జీవితాన్ని మార్చేయగలవన్న విషయాన్ని కొందరు మరచిపోతున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా రోడ్లపై బైక్‌లు, కార్లు తీసుకొని అతి వేగంతో, నియమాలను ఉల్లంఘిస్తూ సాహసాలు చేయడం మామూలైపోయింది.ఓ జంట ఇద్దరూ స్కూటర్‌పై నిల్చొని డ్రైవింగ్ చేయడం, మరికొందరు బైక్‌ను గాల్లో ఎత్తి రహదారిపై స్టంట్లు చేయడం వంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వీటిని చూసి నిస్సాహాయంగా మిగిలిపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు.“ఇలా స్టంట్లు చేసి మీ కుటుంబానికి ప్రమాదం తెచ్చుకోవద్దు” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ( RTC MD VC Sajjanar ) కాస్త సీరియస్‌గా సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

సోషల్ మీడియాలో కొన్ని లైక్‌లు, కామెంట్ల కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత ప్రమాదకరమో మీరు ఊహించగలరా? రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రమాదానికి గురైతే.ఆ మిగిలిన బాధను మీరు కాకుండా మీ కుటుంబం అనుభవిస్తుంది.మీ ఒక్క పొరపాటు వాళ్ల జీవితాన్ని తారుమారుచేస్తుందని ఆయన ఓ వీడియోను షేర్ చేసారు.

ఇలాంటి ప్రమాదకర సాహసాలను ఆపాలని కోరుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.“మీ జీవితం చాలా విలువైనది.పలు ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేయండి. మీ కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేయకుండా పద్ధతిగా, భద్రతతో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోండి.” అని విజ్ఞప్తి చేశారు.సరదా చేష్టలు ఓ హద్దు వరకు బాగుంటాయి, కానీ రోడ్లపై నియమాలు అతిక్రమించి ప్రాణాలను రిస్క్ చేయడం కేవలం మీకే కాదు, పక్కనున్న వారికి కూడా ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉంది.ప్రేమికుల దినోత్సవాన్ని మరపురానిదిగా జరుపుకోండి.
కానీ ప్రాణాంతకమయిన స్టంట్లతో కాదు.







