4545 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్..!

ఇటీవలే 4545 క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్( IBPS ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ ఉద్యోగం సాధించాలి అనే వారికి ఇదే మంచి అవకాశం.

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జూలై 21 వరకు ఈ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.

విద్యార్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.వయస్సు 20-28ఏళ్ల మధ్య ఉండాలి.https://www.ibps.in/ అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

: రెండు దశలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయాల్సి ఉంటుంది.మొదట 100 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.

ఆ తరువాత 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తేనే మెయిన్ పరీక్ష రాసే అవకాశానికి వీలు ఉంటుంది.

Advertisement

ప్రిలిమ్స్ పరీక్షలలో రీజనింగ్ 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్(English language )30 కలుపుకొని మొత్తం 100 మార్కుకులకు పరీక్ష నిర్వహిస్తారు.ఇందులో అర్హత సాధిస్తే మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

మెయిన్ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్కులు,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు కలుపుకొని మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.ఈ క్లర్క్ పరీక్షల తేదీలు ఐబీపీఎస్ ఇంకా ఖరారు చేయలేదు.అయితే పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలలో నిర్వహించే అవకాశం ఉంది.

మెయిన్స్ పరీక్షను అక్టోబర్లో నిర్వహిస్తారు.తెలుగు రాష్ట్రాలలో పరీక్షలు నిర్వహించే కేంద్రాలు ఇవే: కర్నూలు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, చీరాల, కరీంనగర్, ఏలూరు, ఖమ్మం, కాకినాడ, వరంగల్, నెల్లూరు, ఒంగోలు,రాజమహేంద్రవరం, తిరుపతి, శ్రీకాకుళం.మెయిన్ పరీక్ష నిర్వహించే కేంద్రాలు: కర్నూలు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్4, సోమవారం 2024
Advertisement

తాజా వార్తలు