రెండుసార్లు ఫెయిల్.. ఐదో ప్రయత్నంలో సివిల్స్ లో ఏడో ర్యాంక్.. వరుణ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మనలో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని కలలు కంటారు.ఎంతో కష్టపడితే మాత్రమే ఆ స్థాయి ఉద్యోగం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.

అలా ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించి కర్నాటి వరుణ్ రెడ్డి( Karnati Varun Reddy ) వార్తల్లో నిలిచారు.నల్గొండ జిల్లా( Nalgonda District ) మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో వరుణ్ రెడ్డి ఏడో ర్యాంక్ సాధించారు.బాల్యం నుంచి ఐఏఎస్( IAS ) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సింగిల్ డిజిట్ లో ర్యాంక్ రావడం లక్ గా భావిస్తున్నానని వరుణ్ చెప్పుకొచ్చారు.

మనం ఎంత చదివినా మంచి ర్యాంక్ రావాలంటే కొంత లక్ కూడా ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.అమ్మ వ్యవసాయ శాఖలో ఉద్యోగినిగా పని చేస్తున్నారని నాన్న కంటి డాక్టర్ అని వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

సివిల్స్( Civils ) సాధించాలని ఐఐటీలో చదువుతున్న సమయంలోనే బలంగా నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు.

ఈ ర్యాంక్ రావడం వెనుక ఐదేళ్ల కష్టం ఉందని వరుణ్ రెడ్డి చెప్పుకొచ్చారు.గతంలో కొన్ని సందర్భాల్లో అనవసరంగా సివిల్స్ వైపు వచ్చానేమో అని అనిపించిందని వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.కసిగా చదవాలని మొదట ఫెయిల్యూర్ ఎదురైనా వాటిని అధిగమించి ముందడుగులు వేయాలని వరుణ్ రెడ్డి వెల్లడించారు.

నేను రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

వరుణ్ రెడ్డి టాలెంట్ ను నెటిజన్లు సైతం అంతకంతకూ మెచ్చుకుంటున్నారు. వరుణ్ రెడ్డి సక్సెస్ స్టోరీ( Varun Reddy Success Story ) ఎంతో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు 40 మంది ఎంపికైనట్టు సమాచారం అందుతోంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

వరుణ్ రెడ్డి సక్సెస్ స్టోరీ నేటితరంలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు