KA Paul: ఈవిఎమ్ ట్యాంపరింగ్ జరగకపోతే యాభై వేల మెజార్టీతో నేను గెలుస్తా - కేఏ పాల్

నల్గొండ: హోటల్ మనోరమలో కే ఏ పాల్ కామెంట్స్.నన్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అమిత్ షా నాతో అన్నారు.

 I Would Have Won By Fifty Thousand Majority If Evm Tampering Had Not Happened In-TeluguStop.com

ఈవిఎమ్ లు టాంపరింగ్ చేస్తున్నారు.ప్రజా స్వామ్యం దుర్వినియోగం అవుతుంది.

మునుగోడులో మంచిగా ఎలక్షన్ జరిగింది.టీఆరెఎస్ అధికార దుర్వినియోగంకు పాల్పడింది.

సిఆర్పీఫ్ బలగాలతో నన్ను కొట్టించారు.నన్ను ఎన్కౌంటర్ చేస్తామన్నారు.

సీఎం కెసిఆర్ తెలంగాణా ద్రోహి.నాలుగులక్షల అరవై లక్షల కోట్లు దోచుకున్నాడు.

కెసిఆర్ నా తో సమానం అనుకుంటున్నాడు.నా తో పోల్చుకోవడం సరి కాదు.

కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగులను సొంత బంట్రోతుల లాగా వాడుతున్నారు.తెరాస ఓటమి తథ్యం అని వారికి తెలిసిపోయింది.

లక్షల ఉద్యోగాలు తెద్దామని చెబితే టీఆరెఎస్ నాయకులు సప్పోర్ట్ చేయడం లేదు.ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలాంటి రాష్ట్రం లేదు.బీజేపీ మోడీ దేశాన్ని నిర్వీర్యం చేశారు.ఈ హోటల్ లో కనీసం టీ కూడా దొరకడం లేదు.

ఇదా అభివృద్ది.నిన్న ఎలక్షన్ అయిపోతే కౌంటింగ్ ఎందుకు అపారు.

ముప్పైముడు ఏళ్లలో ఎక్కడ నేను ఆగలేదు.నాకు గన్ మెన్ లను ఎందుకు ఇవ్వలేదు.

కెసిఆర్ నలుగురు ఎమ్మెల్యే లను స్టేజిలపై కూర్చోబెట్టి డ్రామా ఆడుతున్నారు.మునుగోడు ఉప ఎన్నికలో నాపై తీవ్ర ఒత్తిడి చేశారు.

రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడని తెలిసి వాళ్ళు కూడా నాకే సప్పోర్ట్ చేశారు.

ఈవిఎమ్ ట్యాంపరింగ్ జరగకపోతే యాభై వేల మెజార్టీ తో నేను గెలుస్తా.

అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తా.కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తుంది.ఎస్పీ కి నిద్ర పట్టక అక్కడ నుండి వెళ్ళిపోయింది.మీడియా తమ్ముళ్ళకైనా అర్ధం అవుతుందా! ఐదు లక్షల కోట్లు అప్పు పెట్టారు మీ మీద.ప్రపంచంలో ఎంతో మంది దుస్టులను చూశాను.కెసిఆర్ లాంటి వాళ్ళను ఎక్కడ చూడలేదు.

వాళ్ళకేమో టివి లలో ఇంటర్వ్యూ లు, నాకేమో యూ ట్యూబ్ లా.యాభై వేల మెజార్టీ తో గెలుస్తున్నాం.రెడ్డి, ఖమ్మ, బ్రమ్మిణ, అన్ని కులాలందరికి అన్ని “బందు”లు ఇవ్వగలను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube