సూర్యాపేట జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసి దౌర్జన్యంగా ఓటర్లును బెదిరించి,బిజెపి ఏజెంట్లపై దాడులు చేశారని శుక్రవారం సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు దిరావత్ బాల్ సన్ నాయక్ ఆరోపిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.మునుగోడులో ఎలాగైన గెలవాలని టిఆర్ఎస్ ఇప్పటివరకు ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా చెయ్యని విధంగా,ఓటమి భయంతో ముందుగానే వామపక్ష పార్టీలను కలుపుకొని,ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో,అడ్డదారిలో రాష్ట్ర యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.
టిఆర్ఎస్ పార్టీపై బిజెపి కోర్టును ఆశ్రయించి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామన్నారు.ధరణి పోర్టల్ లో ఉన్నా నిషేధిత భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.2013లో కెసిఆర్ ఫామ్ హౌస్ 60 ఎకరాలు మాత్రమే ఉందని,ఇప్పుడు 600 ఎకరాల భూమి ఏలా వచ్చిందో చెప్పాలన్నారు.కెసిఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించిందని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకులు భాజపా కార్యకర్తలను బెదిరించారని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.మునుగోడులో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.