నాన్న చెబితేనే వినను... అతను చెబితే వింటానా కంగనా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈమె ఎప్పుడూ ఎలాంటి వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తారో ఎవరికి తెలియదు.

ఈమె కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఈ విషయాన్ని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఈమె కరణ్ జోహార్ నిర్మాణంలో దీపికా పదుకొనె నటించిన గెహ్రాయియా పై ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

ఇక కంగనా రనౌత్ నిర్మాత కరణ్ జోహార్ పేరు వింటేనే ఆమె ఇంతెత్తున అతనిపై చిందులు వేస్తుంది.ఈ క్రమంలోనే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన గెహ్రాయియా సినిమా విడుదలైన తర్వాత మరోసారి కంగనా స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చెబితేనే ఏ మాటా వినను.ఈ బిగ్ డాడీ (కరణ్ జోహార్)ని ఎందుకు పట్టించుకుంటాను అంటూ కామెంట్ చేశారు.

I Will Not Listen When My Father Says But How Can I Listen His Words Kangana Sho
Advertisement
I Will Not Listen When My Father Says But How Can I Listen His Words Kangana Sho

ఈ విధంగా నేను ఏ విషయం గురించి అయినా ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా మంది నేను కెరీర్ లో సక్సెస్ సాధించిన తర్వాత తిరగబడుతున్నానని భావిస్తారు.లైమ్ లైట్‌లో ఉండేందుకు కామెంట్స్ చేస్తున్నానని అభిప్రాయపడతారు.కానీ ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డ నేను ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ కి సంబంధించిన సినిమాలు చేస్తున్నానని తెలిపారు.

ఇకపోతే ఈమె బుల్లి తెర పై లాకప్ అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు