నేను టూ టైప్స్.. నవ్య స్వామి షాకింగ్ స్టోరీ.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.

తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.

ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.ఇటీవలే నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుంది.గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.

కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు.అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా నవ్య స్వామి సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందులో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేసుకుంటుం.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తను చేసిన ప్రతి పోస్ట్ కు రవి కృష్ణ వెంటనే ఏదో ఒక సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.

Advertisement

వారిద్దరి మధ్య ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.ఈమధ్య నవ్య స్వామి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తుంది.పైగా తన పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక షాకింగ్ స్టోరీ పంచుకుంది.ఇంతకు అదేంటంటే.

తను రెండు విధాలుగా ఉంటుందంట.అదేంటంటే తన గురించి ఒకరు పట్టించుకున్నప్పుడు ఒకలా పట్టించుకోనప్పుడు మరోలా ఉంటుందంట.

ఇక ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

తాజా వార్తలు