అసలు నేనేమన్నానంటే...!  ఠాక్రే కు వివరణ ఇస్తున్న వెంకట్ రెడ్డి 

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని, ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేయాలంటే ఇదొక్కటే మార్గం అంటూ వెంకట్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేగింది.అధిష్టానం పెద్దలు కూడా ఈ విషయంపై సీరియస్ కావడంతో వెంకటరెడ్డి వెనక్కి తగ్గారు.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంచ్ లో వెంకటరెడ్డి భేటీ అయ్యారు.

తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రాహుల్ గాంధీ ఏం చెప్పారో తాను కూడా అదే చెప్పానని వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు .ఎవరితోనూ పొత్తు ఉండదని వెంకటరెడ్డి అన్నారు.తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని, తప్పుగా మాట్లాడలేదని, తను మాటలను రాద్ధాంతం చేయవద్దని, బిజెపి నేతలే కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

సోషల్ మీడియా సర్వేల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, కాంగ్రెస్ సీట్లపై చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతం అని వెంకటరెడ్డి అన్నారు.ప్రస్తుతం ఇదే విషయాలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాకూర్ కు వెంకటరెడ్డి వివరణ ఇస్తున్నారు.తెలంగాణలో పొత్తులపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో ఆయనపై అధిష్టానం సీరియస్ కావడంతో  ఠాక్రే వివరణ కోరారు.

దీనిపైనే వెంకటరెడ్డి చర్చిస్తున్నారు.దీనిపై వెంకట్ రెడ్డి ఇచ్చిన వివరణను ఏఐసిసి పెద్దలకు మాణిక్యరావు ఠాక్రే పంపించనున్నారు.

ఆ తరువాత దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే వెంకటరెడ్డి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘించి సొంత పార్టీ నేతల పైన అనేక విమర్శలు చేశారు.అలాగే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా, బిజెపి అభ్యర్థికి మద్దతుగా మాట్లాడారు.దీనికి సంబందించిన ఫోన్ కాల్స్ రికార్డింగ్ లు బయటకు వచ్చి పెద్ద దుమారమే రేపినా.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకుంటారని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అంతా భావించినా.ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇక ఇప్పుడైనా ఆయనపై తీసుకుంటారో లేక హెచ్చరికలతో సరిపెడతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు