ఆ టార్చర్ భరించలేకే జబర్దస్త్ మానుకున్నా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ఆది?

జబర్దస్త్ కమెడియన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది( Hyper Aadi ) ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి తప్పకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయనకు జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

ఇలా తనకు గుర్తింపు తీసుకువచ్చినటువంటి ఈ కార్యక్రమంలో హైపర్ ఆది తప్పుకోవడంతో ఎన్నో సందేహాలు వచ్చాయి.అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి హైపర్ ఆది తప్పకున్న ఇప్పటికి ఇతర మల్లెమాల( Mallemala ) వారి కార్యక్రమాలలో ఈయన పాల్గొంటూ సందడి చేశారు.

ఇలా ఇతర కార్యక్రమాలలోనూ సినిమాలలోను బిజీగా ఉన్నటువంటి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం నుంచి మాత్రం తప్పకుండా తప్పకుండా కారణమేంటి అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు తెలియజేయలేదు కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటకు రావడానికి గల కారణాలను తెలిపారు.కేవలం సినిమాల కారణంగానే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని హైపర్ ఆది తెలిపారు.

తనకు సినిమా అవకాశాలు( Movie Offers ) వస్తున్నాయి కానీ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగటం వల్ల సినిమాలు చేయలేకపోతున్నానని తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమంలో తాను చేయాలి అంటే స్క్రిప్ట్ రైటర్ గా కూడా తానే స్క్రిప్ట్ తయారు చేసుకోవాలని, స్క్రిప్ట్ రాయడానికి రెండు రోజులు ప్రాక్టీస్ చేయడానికి మరికొన్ని రోజులు అలా వారం మొత్తం సరిపోయేది దీంతో నాకు సినిమాలలో నటించే అవకాశం ఉండేది కాదు.అందుకే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నానని  తెలిపారు.

Advertisement

స్క్రిప్ట్ రాయాలి అంటే చాలా టార్చర్ ఉండేదని దానిలో పడితే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా గుర్తించలేమని అందుకే ఆ టార్చర్ భరించలేక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానంటూ ఆది అసలు విషయం తెలిపారు.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?
Advertisement

తాజా వార్తలు