అందరిముందు రష్మీని అంత మాట అనేసిన హైపర్ ఆది.. మరీ ఈ రేంజ్ లోనా?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను బుల్లీతెర పై కామెడీ పంచ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

ఇక హైపర్ ఆది కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు.ముఖ్యంగా అతడు వేసే ఈ పంచులకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

అతడు తన పంచులతో అవతలి వ్యక్తులను చెడుగుడు ఆడేస్తుంటాడు.ఈ క్రమంలోనే ప్రోగ్రాం యాంకర్ మొదలుకొని జడ్జి వరకు ప్రతి ఒక్కరి పై పంచులు వర్షం కురిపిస్తూ ఉంటాడు.

తాజాగా యాంకర్ రష్మీ పై కూడా ఒక పంచ్ వేయడంతో ఆమె నోరు వెళ్ళబెట్టింది.ఇక నవంబర్ 17న ప్రసారం కాబోతున్న కింగ్ వర్సెస్ క్వీన్స్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

Advertisement

ఇక ఇందులో హైపర్ ఆది వేసిన పంచులు హైలెట్ గా నిలిచాయి.సెమీ ఫైనల్ ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా హీరోయిన్ రోజా ఎంట్రీ ఇచ్చింది.

రోజా, ప్రియమణి, పూర్ణ, రష్మీ, దీపిక అందరు కలిసి డ్యాన్సులు వేసి సందడి సందడి చేశారు.ఈ క్రమంలోని హైపర్ ఆది రష్మీ అలాగే దీపిక లపై అదిరిపోయే పంచులు వేశాడు.

ఏమాటకామాటే ఈరోజు ఆ డ్రస్ లలో వాళ్ళిద్దరు బాగా ఉన్నారని హైపర్ ఆది అనడంతో రష్మీ సంబరపడింది.ఇక వెంటనే హైపర్ ఆది ఈ డ్రెస్సులో కనుక మీరు మిస్ ఇండియా పోటీలకు పోతే గేటు దగ్గర ఆపేస్తారు అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేక పోయారు.ఇక అనంతరం హీరోయిన్ రోజా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు