రాకేష్ మాస్టర్ చెల్లెమ్మకు పెళ్ళంట... ఆది బాగానే వాడుకున్నాడుగా...  

ఇటీవల కాలంలో రాకేష్ మాస్టర్ నిత్యం ఏదో ఒక వివాదం లో మునిగి తేలుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజాగా రాకేష్ మాస్టర్ పాల్గొన్న ఓ ఇంట్వ్యూలో ప్రస్తుత జనరేషన్ లో  డాన్స్ కొరియోగ్రాఫర్లు "చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట" అనే పాటకి ఎలా డాన్స్ చేస్తారో అంటూ చేసి చూపించారు.

అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్లో తెగ వైరల్ అవుతుంది.పలువురు ఈ వీడియోపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

అయితే ట్రెండింగ్ టాపిక్స్ ని  క్యాష్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే జబర్దస్త్ ఈసారి రాకేష్ మాస్టర్ వీడియోని బాగానే వాడుకున్నారు.అయితే తాజాగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఉగాది పండుగ కోసం "పండగ  సార్ పండగ అంతే" అనే ఈవెంట్ కార్యక్రమాన్ని షూట్ చేశారు.

ఈవెంట్ లో హైపర్ ఆది తనదైన శైలిలో పంచులతో అలరించాడు.ఇందులో భాగంగా రాకేష్ మాస్టర్ ని అనుకరిస్తూ "చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట" అనే పాటకి స్టెప్పులు వేస్తూ సరదాగా నవ్వించాడు.

Advertisement

అంతేకాక ఈ ఈవెంట్ లో సుడిగాలి సుదీర్ నందమూరి బాలకృష్ణ హిట్ సాంగ్ "స్వాతిలో ముత్యమంత" అనే పాటకి వేసినటువంటి స్టెప్పులు ఈ ఈవెంట్ కే  హైలెట్ గా నిలిచాయి.ఇప్పటికే సుడిగాలి సుదీర్ అభిమానులు నెట్టింట్లో ఈ పాట స్టెప్పులను తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ ఈవెంట్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించినటువంటి ప్రోమో యూట్యూబ్ లో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోల సరసన నిలుస్తోంది.అయితే ఈ ఈవెంట్ నీ పూర్తిగా చూడాలంటే ఉగాది పండుగ రోజు వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు