బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్( MLA Aruri Ramesh ) నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.
ఈ నేపథ్యంలో ఆరూరి రాజీనామాను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది.ప్రెస్ మీట్ వేదికపై ఉన్న ఆరూరిని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, సుందర్ రాజ్( MLC Baswaraj Saraiah, Sundar Raj ) తన ఛాంబర్ లోకి తీసుకెళ్లి మాట్లాడారు.
దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సందిగ్ధంలో పడ్డారు.ఆ తరువాత ఆరూరి నివాసాని కి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Former Minister Errabelli Dayakar Rao ) వచ్చారు.
ఆరూరితో భేటీ అయిన దయాకర్ రావు పార్టీ మార్పు వ్యవహారంపై నచ్చజెప్పారు.అనంతరం ఆరూరిని తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్తేందుకు ప్రయత్నించగా దయాకర్ రావు వాహనాన్ని ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే నిన్న అమిత్ షా తో భేటీ అయిన ఆరూరి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటిస్తుండగా గులాబీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.







