ఎలక్టోరల్ బాండ్ల( Electoral Bonds ) వివరాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) సుప్రీంకోర్టులో( Supreme Court ) అఫిడవిట్ దాఖలు చేసింది.ఇవాళ్టి వరకు రీడీమ్ అయిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ అందులో పొందుపరిచింది.2019 నుంచి 2024 మధ్య సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు అయ్యాయని ఎస్బీఐ తెలిపింది.అలాగే 2019 నుచి 2024 మధ్య 22,030 బాండ్లు రీడీమ్ అయ్యాయని పేర్కొంది.

నిన్న ఈ వివరాలను ఎలక్షన్ కమిషన్ కు( Election Commission ) ఎస్బీఐ తెలిపింది.ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించే గడువు పొడిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం రెండు రోజుల క్రితం విచారణలో భాగంగా నిరాకరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్బీఐ వివరాలను వెల్లడించింది.







