కవర్ లోపల పొరల్లో బంగారం అక్రమ రవాణా.. ఎయిర్ పోర్ట్ లో పట్టివేత..!

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించిన అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.

దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని విచారణలో తేలింది.అచ్చం సినిమాలోలా.కవర్ లోపల పొరల్లో రేకుల రూపంలో బంగారాన్ని దాచి పెట్టి అక్రమంగా తరలిస్తున్నారు.

Hyderabad Shamshabad Airport Gold Smuggling In Cover Layers Two Persons Arrested

దుబాయ్ నుండి ఒక వ్యక్తి ఈ బంగరాన్ని తీసుకురాగా మరో వ్యక్తికి అది అందించే క్రమంలో కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చి సోదాలు చేయగా వ్యవహారం బట్టబయలు అయ్యింది.వారు తలరిస్తున్న కిలోకి పైగా బంగారం విలువ 47.63 లక్షల రూపాయలు దాకా ఉంటుందని సమాచారం.ఈ విషయంపై కస్టమ్స్ అధికారులు పూర్తి వివరాలు అందించాల్సి ఉంది.

ఆ వ్యక్తులను పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ బంగారం ఎక్కడ నుండి ఎక్కడకు తరలిస్తున్నారు.ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం జరుగుతుంది.

Advertisement

హైదరాబాద్ లో వీరి దగ్గర బంగారం తీసుకునేది ఎవరన్న విషయాలపై క్లారిటీ వస్తుంది.అధికారులు మాత్రం ఆ ఇద్దరు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియచేస్తామని అన్నారు కస్టంస్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు