ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అల్లుడిని చంపిన మామ..!

ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు.పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

కానీ వీరి ప్రేమకు పెద్దల అంగీకారం దొరకలేదు.

దీంతో వారు పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకొని ఒక్కటైయ్యారు.

కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి కోపంతో రగిలిపోయాడు.హైదరాబాద్‌‌కు చెందిన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి యువకుని కిరాతకంగా హత్య చేయించాడు.

నల్గొండ జిల్లాలో జరిగిన పరువు హత్యలాగే హైదరాబాద్ లో కూడా జరిగింది.ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపుతోంది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే. హైదరాబాద్‌లోని చందానగర్‌ కి చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

ఇద్దరివి వేరు వేరు కులాలు కావడంతో అమ్మాయి తండ్రి పెళ్ళికి నిరాకరించాడు.దీంతో యువతి తన తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంది.

కోపానికి గురైన అమ్మాయి తండ్రి అల్లుడిని కిరాయి మనుషులతో ఎత్తుకొచ్చాడు.అనంతరం యువకుడిని సంగారెడ్డిలో హత్య చేపించాడు.

ప్రేమ జంట పెళ్లి అనంతరం చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు.అయితే హేమంత్ కనిపించకపోవడంతో అతనిపై మిస్సింగ్ కేసు కింద గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

మృతదేహాన్ని పోస్టుమార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదని హేమంత్‌ భార్య అవంతి కంటతడి పెట్టారు.

తాజా వార్తలు