గుర్తులతో తికమక ... సమ్మెతో అయోమయం ! అయ్యో టీఆర్ఎస్

రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ తనకున్న అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించిలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

ఆయన తీసుకున్న ప్రతి నిర్నయం వివాదాస్పదం అవుతుండడంతో కేసీఆర్ చిక్కుల్లో పడుతున్నాడు.ప్రస్తుతం తెలంగాణాలో హోరాహోరీగా సాగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచనారనికి తెర పడింది.

మరో రెండు రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరి సొంతం అవుతుంది అనే విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ముఖ్యంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడంల వల్ల టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Advertisement

దీనికి తోడు ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చెలరేగి అది హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపించే స్థాయిలోకి వెళ్ళిపోయింది.ఈ టెన్షన్ ఇలా ఉండగానే ఇప్పుడు టీఆర్ఎస్ ను మరో అంశం కలవరపెడుతోంది.

ఈ ఎన్నికలో ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది.ఉప ఎన్నికల బరిలో మొత్తం 28 మంది రంగంలో ఉన్నారు.అయితే టిఆర్ఎస్ అభ్యర్ధికి నాలుగో నెంబర్ ను ఈసీ కేటాయించింది.5వ నెంబర్ అభ్యర్థికి ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు రావడం టీఆర్ఎస్ లో టెన్షన్ రేపుతోంది.అలాగే 6వ నెంబరు అభ్యర్ధికి రోడ్ రోలర్ గుర్తు రావడం, ఈ గుర్తులు రెండు కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో తమకు పడాల్సిన ఓట్లు ఇండిపెండెట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తారేమో అన్న ఆందోళన టీఆర్ఎస్ లో కనిపిస్తోంది.

అసలు ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మెతో టీఆర్ఎస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

  ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తన స్ధానాన్ని కాపాడుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యంలో గుర్తులు భయం టీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తోంది.తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనేక చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు ట్రక్ గుర్తును కేటాయించడం, అది కారు గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు చాలామంది అయోమయానికి గురయ్యి ట్రక్ గుర్తుకు ఓటు వేశారని, దీని కారణంగా చాలా చోట్ల చాలామంది అభ్యర్థులు ఓటమి చెందారని టీఆర్ఎస్ నాయకులు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అయినా ఫలితం అయితే కనిపించలేదు.ఇప్పడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమో అని టీఆర్ఎస్ కంగారు పడుతోంది.

Advertisement

తాజా వార్తలు