దూకుడుగా హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్... సత్తా చాటేనా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరూ హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే చర్చించుకుంటున్నారనే విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నాయన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్,  బీజేపీ పార్టీ తరపున ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.ఈ ఉప ఎన్నిక కంటే ముందు హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ బలాబలాలను ఒకసారి విశ్లేషిస్తే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బలమైన పార్టీగా మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్న పరిస్థితి.

అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయిన పరిస్థితి ఉంది.ఇక అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు.

అయితే విద్యార్థి నాయకుడిగా ఉన్న  బల్మూరి వెంకట్ ను హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించడం కొంత కాంగ్రెస్ లోనే కలకలం రేగిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా ప్రచారాన్ని కూడా ప్రారంభించిన బల్మూరి వెంకట్ అక్కడి పరిస్థితులను ప్రస్తుతం అవగతం చేసుకునే పనిలో నిమగ్నమయి ఉన్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే స్వతహాగా దూకుడు మనస్తత్వం ఉన్న నాయకుడిగా పేరున్న బల్మూరి వెంకట్ దూకుడుగా వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంత వరకు తన రాజకీయ భవిష్యత్తును మెరుగుపర్చుకునేందుకు  ఈ ఎన్నికను ఉపయోగించుకునే అవకాశం ఉంది.ఎందుకంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు.

ప్రస్తుతం పోటీ బీజేపీ పార్టీ , టీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్న తరుణంలో కాంగ్రెస్ ఎన్నిక మాత్రం నామమాత్రంగా నే ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు