హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ తటస్తంగా రసమయి...అసలు కారణమిదే?

రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.అంతర్గతంగా జరిగే కొన్ని రాజకీయాలు సామాన్య ప్రజలకు అంతుపట్టవు అయితే పెద్దగా ప్రజల్లో కూడా బహిర్గతం కావు.

 Huzurabad By Election Neutral Rasamayi What Is The Real Reason, Etela Rajender,-TeluguStop.com

కేవలం రాజకీయ విశ్లేషకులకు మాత్రమే దీనిని లోటుపాతులు అనేవి తెలుస్తాయి.ఎందుకంటే మీడియా ముందు రాజకీయానికి అంతర్గత రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నేవి అన్నీ  తెర వెనుక అనే విషయం మనకు తెలిసిందే.అచ్చం ఇలాగే కొనసాగుతోంది రసమయి వ్యవహారం.

ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎంత మంచి స్నేహితులు అన్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈటెల ఇప్పుడు టీఆర్ఎస్ నుండి నిష్క్రమించిన సందర్భంలో ఈటెలపై టీఆర్ఎస్ మంత్రులు కాని టీఆర్ఎస్ నాయకులు కాని కారాలు, మిరియాలు రువ్వుతున్న విషయం తెలిసిందే.

కాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధి అయి ఉండి హుజూరాబాద్ లో ఇంత రాజకీయ రణరంగం కొనసాగుతున్నా రసమయి మాత్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈటెలను విమర్శించలేక టీఆర్ఎస్ కు మద్దతు పలకలేక  స్పందించడం లేదన్నది లోగుట్టు కథనం.

కాని కెసీఆర్ దృష్టికి ఈ విషయం వెళ్ళినట్లు తెలుస్తోంది.దీనిపై ఇప్పటికిప్పుడు కెసీఆర్ స్పం  దించకున్నా హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube