విజయవాడ టిడిపి ఎంపి కేసినేని నాని వ్యవహారం గత కొంతకాలంగా టిడిపిలో లో చర్చనీయాంశం మారింది.ఆయన పార్టీలో ఉన్నా, లేనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
చంద్రబాబుతో పాటు చంద్రబాబుకు సన్నిహితులుగా ముద్రపడిన నాయకులతో ఆయనకు విభేదాలు ఏర్పడడం, వారిని ప్రోత్సహిస్తూ తనను పట్టించుకోనట్లు గా అధినేత చంద్రబాబు వ్యవహరించడం , నాని పార్టీలో అసంతృప్తి కి గురవడంతో పాటు, మీడియా వేదికగాను తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి పోటీ చేయరని, ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, బిజెపిలోకి వెళ్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా, అప్పట్లో నాని దానిని ఖండించారు.
కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడిని టిడిపి ప్రోత్సహిస్తూ రావడం వంటివి మరింత మంట పుట్టించాయి.
ఇటీవల జరిగిన ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లిన సందర్భంలో టిడిపి ఎంపీలు బాబు కి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నానిని బొకే అందించాల్సిందిగా, మరో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబు సమక్షంలోనే ఆ బొకేను పక్కకు నెట్టారు.దీంతో నాని వ్యవహారం టిడిపిలో తీవ్ర దుమారం రేపింది.
ఇదిలా ఉంటే తాజాగా బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ థియేధర్ నివాసానికి నాని వెళ్లడం, ఆయన నివాసంలో జరిగిన వినాయక చవితి పండుగ వేడుకల్లో నాని పాల్గొనడం తో నాని బిజెపిలోకి వెళ్తున్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. సునీల్ థియేధర్ కేసినేని నాని కి మధ్య ఏపీ రాజకీయం గురించి చర్చి జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం టిడిపి అభ్యర్థి చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే నాని కూడా బిజెపి కీలక నేతలతో చర్చలు జరుగుతుండడం ఆశక్తికరంగా మారింది.

ప్రస్తుతం నాని సునీల్ దియోధర్ , నాని మధ్య ఏ ఏ అంశాలపై చర్చ జరిగిందనే విషయంపై టిడిపి అధిష్టానం సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.అయితే ఇది సాధారణ భేటీ గాని నాని అన్సర్లు చెబుతున్నా, టిడిపి అధిష్టానం మాత్రం నాని బిజెపిలోకి వెళ్తారేమో అన్న అనుమానంలోనే ఉంది.అయితే నాని టిడిపిలోనే కొనసాగుతారా ? బిజెపిలోకి వెళ్లే ఉద్దేశం ఉందా అనే విషయం నాని మాత్రం తన మనసులో మాట ఏమిటనేది స్పష్టంగా బయటకు వెళ్లడంచకపోవడంతోనే ఈ రకమైన గందరగోళం నెలకొంది.
.






