భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త..!

కుటుంబం అన్నాక ఏవో సమస్యలు రావడం సహజం.సర్దుకుపోవడం లేదంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం చేస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది.

అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయడం, మనస్పర్ధలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోకుండా మనసులో పెట్టుకొని గొడవకు దిగితే ఎలా ఉంటుందో అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.భార్యాభర్తల మధ్య గొడవ.

ఆగ్రహం పట్టలేకపోయిన భర్త ( Husband ) విచక్షణా జ్ఞానం కోల్పోయి కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామంలో చోటుచేసుకుంది.ఈ హత్య ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడి స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Advertisement

మణుగూరు సీఐ రమకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.సమితి సింగారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల రాములు,( Gattikoppula Ramulu ) మంగతాయారు( Mangatayaru ) భార్యాభర్తలు.గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలే.

విషయం చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రతిదానికి ఇద్దరు గొడవ పడేవారు.ఈ క్రమంలో గురువారం రాత్రి ఈ దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

భార్య మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా రాములు శుక్రవారం ఉదయం ఇంట్లో ఉండే గొడ్డలితో భార్య మంగతాయారును నరికి హత్య చేశాడు.

హత్య అనంతరం నిందితుడు రాములు నేరుగా మణుగూరు పోలీస్ స్టేషన్ కు ( Manuguru Police Station ) వెళ్లి హత్య విషయం చెప్పి లొంగిపోయాడు.సీఐ రమకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.చుట్టుపక్కల ఉండే స్థానికులను పోలీసులు విచారించగా.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
అయ్యయ్యో.. అలా పొగిడాడో లేడో.. ఇలా పడిపోయిన మహిళా బైకర్ (వీడియో)

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

తాజా వార్తలు