వైఎస్ జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.యావత్ దేశంలోనే పరిశ్రమల స్థాపనకు, వ్యాపార అభివృద్ధికి ఏపీ ప్రధాన ఎంపికగా మారిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇందుకు కారణం రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత.పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పెట్టుబడిదారులకు పలు అవకాశాలు కల్పిస్తోంది.
అంతేకాదు పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తూ రాయితీలు ఇస్తుంది.
ఇటీవలే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు హాజరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి.కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలతో పాటు సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి (SIPB) కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ మేరకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాబోతోంది.సంస్థ ప్రతిపాదనలను సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది.దీని వలన సుమారు ఆరు వందల మందికి ప్రత్యక్షంగా మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలుస్తోంది.
అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ.166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి కంపెనీని ప్రారంభించనుంది.ఈ సంస్థ ద్వారా దాదాపు 5 వేలమందికి ఉపాధి దొరుకుతుంది.ఇదే సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ.679 కోట్లతో సంస్థను విస్తరించనుండగా దీనిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి.
ఏలూరులోని కొమ్మూరువద్ద రూ.114 కోట్లతో ఏర్పాటు కానున్న వెంకటేశ్వర బయోటెక్ సంస్థ 310 మందికి ఉపాధిని కల్పించనుంది.అలాగే తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ రూ.933 కోట్లతో సంస్థను విస్తరిస్తుండగా 2100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి.రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న ఆంధ్రపేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.దీనికోసం రూ.4,000 కోట్లు పెట్టుబడి పెడుతుండగా దీనివల్ల రూ.3000 మందికి ఉద్యోగాలు వస్తాయి.మరియు విజయనగరంలోని ఎస్.కోట వద్ద రూ.531 కోట్లతో ఏర్పాటు చేస్తున్న JSW ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి , పరోక్షంగా 9375 మందికి ఉపాధి లభించనుంది.విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ.50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుండగా దీనిలో 550 మందికి ఉద్యోగాలు వస్తాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడడంతో పాటు వేల సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.