మొన్న జానీ మాస్టర్.. నేడు హర్షసాయి.. ప్రముఖులకు వరుసగా షాకులు తగులుతున్నాయా?

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి( Youtuber Harsha Sai ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.

అయితే ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా హర్షసాయి పేరు వార్తల్లో నిలవగా తాజాగా హర్షసాయికి మరో భారీ షాక్ తగిలింది.

యూట్యూబర్ గా యూత్ కు దగ్గరై మంచి పేరును సొంతం చేసుకున్న హర్షసాయికి ఒక యువతి భారీ షాకిచ్చింది.పెళ్లి పేరుతో హర్షసాయి తనను మోసం చేశాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అడ్వొకేట్ తో పాటు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి హర్షసాయితో పాటు ఆయన తండ్రిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.హర్షసాయి ప్రస్తుతం హీరోగా మెగా( Mega Movie ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు.ఎంతోమంది పేదలకు తన వంతు సహాయం చేయడం ద్వారా హర్షసాయి వార్తల్లో నిలిచారు.

ఈ వివాదంపై హర్షసాయి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్( Jani Master ) ఒక వివాదం ద్వారా అరెస్ట్ కాగా ఈ ఘటనను మరవక ముందే హర్షసాయి పేరు కూడా ఇదే తరహా వివాదం ద్వారా వార్తల్లో నిలవడం కొసమెరుపు.హర్షసాయి స్వీయ దర్శకత్వంలో మెగా అనే మూవీ తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా రావాల్సి ఉంది.ఈ సినిమాలో మిత్ర హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు.

హర్షసాయి వివాదంలో చిక్కుకోవడం నెటిజన్లను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.హర్షసాయి కెరీర్ కు ఈ వివాదం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాల్సి ఉంది.

హర్షసాయి పేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.హర్షసాయి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు