వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్రసాయుద బలగాలతో భారీ కవాతు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లోని సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు కలిగిన నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్ నగర్, ఎదురుగట్ల, మర్రిపల్లి, లింగం పల్లి గ్రామాలలోని ప్రధాన రహదారుల గుండా కేంద్రసాయుద బలగాల తో కవాతు జిల్లా అడిషనల్ ఎస్ పి చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ప్రజలు స్వేచ్చాయుత వాతావరణం లో తమ ఓటు హక్కు ని వినియోగించుకోవాలని కవాతు నిర్వహించడం జరుగుతుంది అని అడిషల్ ఎస్ పి తెలిపారు.

ఈ కవాతు కార్యక్రమంలో వేములవాడ డి ఎస్ పి నాగేంద్ర చారి, రూరల్ సి ఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయం ... మహిళలకు పండుగే 

Latest Rajanna Sircilla News