Siddham Meeting : సిద్ధం 2 కు సర్వం సిద్ధం .. అన్నీ భారీగానే 

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధం( Siddham ) అనే నినాదాన్ని గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వినిపిస్తోంది.

పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భారీ సభలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు( Uttarandhra ) చెందిన పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులలో ఉత్సాహం నింపేందుకు భీమిలి నియోజకవర్గం లో భారీ సభను నిర్వహించారు.ఊహించని విధంగా ఈ సభకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడం తో ఆ సభ అనుకున్న దాని కంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యింది.

అదే ఉత్సాహంతో సిద్ధం రెండవ సభను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్ల చేపట్టారు.

ఈ రోజు సిద్ధం సభ( Siddham Meeting )ను అంతకంటే భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.ఈ సభలో స్వయంగా జగన్( CM YS Jagan ) పాల్గొని ప్రసంగించనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసారు.ఉమ్మడి గోపయ్య గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ,డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని( MLA Alla Nani ), దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి , ఎమ్మెల్సీ తలసేల రఘురాం అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు.

Advertisement

అలాగే జగన్ పార్టీ శ్రేణులకు దగ్గరగా వచ్చి అందరిని పలకరించేందుకు వీలుగా ఫ్యాన్ ఆకారంలో  భారీ వాక్ వేను ఏర్పాటు చేశారు.

ఇక ప్రధాన రహదారుల పై భారీగా సిద్ధం ఫ్లెక్సీలను( Siddham Flexis ) ఏర్పాటు చేశారు.చింతలపూడి నియోజకవర్గం నుంచి 1000 బైకులు 250 కార్లతో భారీ ర్యాలీని ఆ నియోజకవర్గ నేతలు ఏర్పాటు చేసుకున్నారు.175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్న జగన్ ఆ మేరకు ఆ సందేశాన్ని వినిపించనున్నారు 175 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలి ? పార్టీ క్యాడర్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అనే విషయాల పైన జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు