స్టార్‌ హీరో తండ్రికి క్యాన్సర్‌, ఆందోళనలో సినీ వర్గాలు, ఫ్యాన్స్‌.. ఏ స్టేజ్‌లో ఉందంటే..!  

  • బాలీవుడ్‌ స్టార్స్‌ క్యాన్సర్‌ బారిన పడటం ఈమద్య కాలంలో చాలా కామన్‌ అయ్యింది. కేవలం బాలీవుడ్‌ వారు అనే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు ఇప్పటికే క్యాన్సర్‌ వల్ల మృతి చెందారు.

  • Hrithik Roshan Father Rakesh Have Cancer-Hrithik Rakesh Cancer Stage

    Hrithik Roshan Father Rakesh Roshan Have Cancer

  • తెలుగు సినీ దిగ్గజం ఏయన్నార్‌ క్యాన్సర్‌ వల్ల మృతి చెందిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్‌కు చెందిన సోనాలి బింద్రే క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇంకా పలువురు కూడా క్యాన్సర్‌ను జయించారు, మరి కొందరు మృతి చెందారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ను క్యాన్సర్‌ పట్టి పీడిస్తోంది.
    రాకేష్‌ రోషన్‌ క్యాన్సర్‌ విషయంపై ఆయన తనయుడు హీరో హృతిక్‌ రోషన్‌ స్పందించాడు. తన తండ్రి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు నేడు ఆపరేషన్‌ జరుగబోతుంది. ఆయన క్యాన్సర్‌ను జయిస్తాడని తాము భావిస్తున్నాం. అభిమానులు ఆయనకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనకు మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా బాగు అవుతుందని నమ్ముతున్నాను అంటూ హృతిక్‌ రోషన్‌ ఎమోషనల్‌గా పోస్ట్‌ చేసింది.

  • హృతిక్‌ రోషన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌కు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. రాకేష్‌ రోషన్‌ ఆరోగ్యం బాగు పడాలని, ఆయన మళ్లీ మునుపటిలా సినిమాలు చేయాలంటూ బాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. రాకేష్‌ రోషన్‌ క్యాన్సర్‌ విషయం తెలియడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • క్యాన్సర్‌ను రాకేష్‌ రోషన్‌ జయిస్తాడా లేదా అనేది చూడాలి. ఆపరేషన్‌ అంటూ హృతిక్‌ రోషన్‌ ప్రకటించిన నేపథ్యంలో రాకేష్‌ రోషన్‌ క్యాన్సర్‌ తుది దశలో ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Hrithik Roshan Father Rakesh Have Cancer-Hrithik Rakesh Cancer Stage