మెడ న‌లుపును సుల‌భంగా పోగొట్టే మిల్క్ పౌడర్..ఎలాగో తెలుసా?

శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉండి మెడ మాత్ర‌మే న‌ల్ల‌గా ఉంటే చూసేందుకు ఇత‌రుల‌కే కాదు మ‌న‌కు సైతం అస‌హ్యంగా మ‌రియు ఇబ్బందిగానే ఉంటుంది.

అందుకే మెడ న‌లుపు వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కాస్ట్లీ క్రీములు వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఎంత‌గానో వ‌ర్రీ అయిపోతుంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా? అయితే ఇక‌పై చింతించ‌కండి.ఎందుకంటే మెడ న‌లుపును సుల‌భంగా పోగొట్ట‌డంలో మిల్క్ పౌడ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా మిల్క్ పౌడ‌ర్‌ను ఎలా వాడాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల మిల్క్ పౌడ‌ర్‌, మూడు స్పూన్ల కీర‌దోస ర‌సం మ‌రియు కొద్దిగా నిమ్మ ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి కాస్త డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డార్క్ నెక్ వైట్‌గా, స్మూత్‌గా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మిల్క్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ పెస‌ర పిండి మ‌రియు రెండు స్పూన్ల‌ తేనె వేసుకుని క‌లుపుకోవాలి.అపై ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు పూసి పావు గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా మెడ న‌లుపు మ‌టుమాయం అవుతుంది.

ఇక ఒక గిన్నెలో ఒక‌ స్పూన్ మిల్క్ పౌడ‌ర్‌.రెండు స్పూన్ల కొబ్బ‌రి నీళ్లు వేసుకుని మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు ప‌ట్టించి ఇర‌వై నిమిషాల త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇలా రోజుకు ఒక సారి చేస్తే మెడ న‌లుపు పోవ‌డ‌మే కాదు.మృదువుగా, అందంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు