మీ ఫోన్ పొతే అది ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి ?

జేబులో ఫోన్ వేసుకొని బైక్ మీద రయ్ మంటూ వెళుతున్నారు.మీ స్పీడుకి మీ ఫోన్ కింద పడిపోతే కూడా మీరు గమనించడం కష్టం.

ఇంటికొచ్చి చూస్తే ఫోన్ కనబడటం లేదు.దారిలో ఎక్కడుందో తెలియదు.

దాన్ని ఎవరు తీసుకున్నారో తెలియదు చివరకి ఎవరి చేతిలో ఉందొ కూడా తెలియదు.రెస్టారెంట్లో, బస్టాండ్ లో, ఎక్కడపడితే అక్కడ మొబైల్ పారేసుకుంటారు జనాలు.

అది మంచి బుద్ధి ఉన్నవాళ్ళ చేతికి చిక్కితే మనదాక వస్తుంది లేదంటే ఇక దాన్ని మర్చిపోవడమే.ఒక్కోసారి ఫోన్ పొతే పోయింది, కొత్తది కొనుక్కుంటాం అనుకోవచ్చు కాని, ఆ ఫోన్ లో పర్సనల్ డేటా ఉంటుంది.

Advertisement

ఆ పర్సనల్ విషయాలు బయటకి వ్యక్తీ చేతిలో పడితే ఎలా ? ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ? ఫోన్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి ? గుర్తు తెలియని వ్యక్తీ చేతిలో ఉన్న ఫోన్ ని ఎలా లాక్ చేయాలి ? డేటా ని ఎలా డిలీట్ చేయాలి ? మొదట మీ ఫోన్లో Google Settings యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.ఆ తరువాత అదే యాప్ ల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

ఇప్పుడు గూగుల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Remotely locate this device, Allow remote lock and erase, ఈ రెండు ఆప్షన్స్ ఆన్ చేయండి.ఈ ఆప్షన్స్ ఎప్పుడు ఆన్ చేసి పెట్టండి.

ఎందుకంటే మన ఫోన్ ఎప్పుడు మిస్ అవుతుందో చెప్పలేం కదా.ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఎక్కడో పోయింది అనుకుందాం.లేదంటే టెస్టింగ్ కోసం మీరే మీ పక్కింట్లో వదిలేయండి.

ఇప్పుడు మీ కంప్యూటర్ లో గూగుల్ లో కి వెళ్లి Android Device Manager లోకి వెళ్ళండి.మీ గూగుల్ సెట్టింగ్స్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళండి.మీ మొబైల్ లో అల్రెడి Remotely locate this device అనే ఆప్షన్ ఆన్ చేసి ఉండటం వలన, ఇప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉందొ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ట్రేస్ చేసి చెబుతుంది.

Advertisement

ఇక Allow remote lock and erase ఆన్ చేసి ఉండటం వలన మీకు Ring అనే ఆప్షన్ తో పాటు Lock మరియు Erase ఆప్షన్స్ కనబడతాయి.మీరు రింగ్ నొక్కగానే మీ ఫోన్ రింగ్ అవుతుంది.

లాక్ నొక్కితే మీ ఫోన్ లాక్ అవడమే కాదు, మీరు మీ కంప్యూటర్ నుంచే ఆ ఫోన్ పాస్ వర్డ్ ని మార్చుకోవచ్చు.ఎరెజ్ నొక్కడం ద్వారా మీ పర్సనల్ డేటా అవతలి వ్యక్తీ కంట్లో పడకుండా మొత్తం డిలీట్ చేయవచ్చు.

తాజా వార్తలు