భార్యభర్తలు గొడవ పడకూడదంటే ఏం చేయాలి?

భార్యభర్తలు అన్నాక గొడవలు జరగడం చాలా సహజం.

కాని చిన్నచిన్న విషయాలకు కూడా పట్టింపుకి వెళ్ళి, గొడవను పెద్దగా చేయడం, లేదంటే ఎప్పుడో జరిగిన తప్పుని గొడవల్లో బయటకు తీయడం లాంటివి చేయడం వలన రిలేషన్ షిప్స్ దెబ్బతింటాయి.

కొన్ని విషయాల్లో విచక్షణతో వ్యవహరించి పరిస్థితులను బాగు చేయాలి భాగస్వాములు.అప్పుడే కలహాలను దూరంగా పెట్టవచ్చు.

భార్యభర్తలు ఎలా మెదలకూడదో, ఎలా మెదలాలో ఓసారి చూద్దాం.* భర్త ఒకమాట చెబుతోంటే భార్య .భార్య ఒకమాట చెబుతోంటే భర్త .ఎదుటివారి మాటను పూర్తిగా వినాలి.మాటలని వినీవిననట్టుగా, టీవి చూస్తూ, దిక్కులు చూస్తూ, మొబైల్ వాడుతూ ఏకాగ్రత చూపకపోగడం ఎదుటివారికి కోపం తెప్పిస్తుంది.

* ఓసారి తప్పు జరిగితే, అది సర్దుకున్నాక దాన్ని అక్కడే మర్చిపోవాలి.దాన్ని గొడవల్లో వాడటం, మాటిమాటికీ గుర్తుచేయడం, సమాధానం లేనప్పుడు ఆ తప్పులను పట్టుకోని పొడవటం లాంటివి చేయకూడదు.

Advertisement

ఇష్టమైనవారు ఇలా చేస్తే మనసుకి చాలా బాధగా ఉంటుంది.* తప్పు చేస్తే, మౌనంగా ఉండటం వద్దు.నిర్మొహమాటంగా జరిగిన తప్పు గురించి భాగస్వామితో చెప్పాలి.

ఏదైనా ఇబ్బంది కలిగితే, దాన్ని మనసులోనే ఉంచుకోని దూరంగా జరగటం ఎక్కువగా ఆడవారు చేసేపని.మీరు తప్పుని చూపించి కోపంగా మాట్లాడినా బాధపడని భర్త, దాన్ని దాచుకుంటూ దూరంగా వెళితే మాత్రం ఖచ్చితంగా బాధపడతాడు.

* అతిగా అనుమానించటం, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం, మొబైల్ ఫోన్, డైరి లాంటివి చెక్ చేయడం, భార్యలు మగవారితో మాట్లాడితే, భర్తలు ఆడవారితో మాట్లాడితే, పొసెసివ్ గా బిహేవ్ చేయడం కూడా మానుకోవాలి.గొడవలన్ని ఇలాంటి కారణాలతోనే మొదలవుతాయి.

* అలక ఆడవారికి అందమే.కాని అందానికి, హింసకి మధ్య సన్నని గీత ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అది దాటనంతవరకు అలక బాగుంటుంది.* క్షమించడం నేర్చుకోవాలి.

Advertisement

ఆ గుణం లేనిదే, మీది ఎప్పటికి ప్రేమ కాదు.ప్రేమించేవారికి, భాగస్వామికి క్షమించే సహనం కూడా ఉండాలి.

తాజా వార్తలు