'ఆదిపురుష్' లో రావణాసురిడి పాత్ర చెయ్యాల్సిన ప్రభాస్ చివరికి రాముడు ఎలా అయ్యాడు?..తెర వెనుక ఇంత నడిచిందా!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటిస్తున్న సినిమాలలో ఆదిపురుష్( Adipurush ) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది.

వచ్చే నెల 16 వ తేదీన ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళం, మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల కాబోతుంది.

రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు.దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఊర మాస్.అక్కడి ఆడియన్స్ కి మొదటి నుండి శ్రీ రాముడు అంటే మహా భక్తి.

ఆయన చరిత్ర ని సరికొత్త టెక్నాలజీ తో, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ తో నిర్మిస్తే అంతకు మించి వాళ్లకు కావాల్సింది ఏముంది.అందుకే ఈ సినిమా ట్రైలర్ కి కేవలం 24 గంటల్లోనే 50 మిలియన్ కి పైగా వ్యూస్ హిందీ వెర్షన్ కి వచ్చాయి.

Advertisement

అయితే ఆదిపురుష్ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు చాలా పెద్ద కథే నడిచింది.అదేమిటంటే తానాజీ చిత్రం తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ హృతిక్ రోషన్ ని పెట్టి రామాయణం తీద్దాం అనుకున్నాడు.

ఇందులో రాముడిగా హృతిక్ రోషన్ ని( Hrithik Roshan ) అనుకోగా, రావణాసురిడిగా ప్రభాస్ ని అనుకున్నాడు.ప్రభాస్ కంటే ముందుగా ఆదిపురుష్ స్క్రిప్ట్ మొత్తాన్ని హృతిక్ రోషన్ కి వినిపించాడు.

హృతిక్ రోషన్ నటించడానికి ఒప్పుకున్నాడు కానీ, కొన్ని ముఖ్యమైన మార్పులు చెయ్యాల్సింది గా కోరాడు, అందుకు ఓం రౌత్ ఒప్పుకోలేదు.ఎందుకంటే దశాబ్దాల నుండి శ్రీరాముడు అంటే ఇలాగే ఉంటాడు, రావణాసురిడి వేషధారణ ఇలాగే ఉంటుంది అని సినిమాల్లో చూపించి జనాల్లో బాగా రుద్దేశారు, కానీ అసలైన రాముడి రూపం ఇలా ఉంటుంది,

రావణాసురుడి రూపం ఇలా ఉంటుంది అని ఈ చిత్రం ద్వారా చూపించడమే ఓం రౌత్ ప్రయత్నం అట.ఇది భవిష్యత్తులో కచ్చితంగా వివాదాలకు దారి తీసే విధంగా ఉంటుందేమో అని భయపడి హృతిక్ రోషన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు.ఇక ఆ తర్వాత ఇక ప్రభాస్ ని శ్రీ రాముడిగా చూపించాలని ఫిక్స్ అయ్యి, ఆయనకీ ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించాడు ఓం రౌత్.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

కేవలం సింగిల్ సిట్టింగ్ లోనే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి ఒప్పేసుకున్నాడు.ఆ తర్వాత సీత గా కృతి సనన్ ని , అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నారు.

Advertisement

షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే అయిపోయింది, గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించారు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ, గత ఏడాది టీజర్ కి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ని చూసి గ్రాఫిక్స్ పై మరోసారి రీ వర్క్ చేసి ఇంకా క్వాలిటీ ఔట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో జూన్ 16 వ తేదికి వాయిదా వేశారు.గ్రాఫిక్స్ రీ వర్క్ ఔట్పుట్ అదిరిపోయింది అని ట్రైలర్ ని చూసినప్పుడే అర్థం అయిపోయింది.

మొబైల్ లో ట్రైలర్ చూస్తున్నప్పుడే ఒక సరికొత్త లోకం లోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది, ఇక థియేటర్స్ లో ఈ చిత్రం ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతి కలిగించబోతుందో తెలియాలంటే వచ్చే నెల 16 వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు